బ్యాట్‌ పడితే బాదుడే.. | - | Sakshi
Sakshi News home page

బ్యాట్‌ పడితే బాదుడే..

Aug 29 2026 12:11 AM | Updated on Aug 29 2026 12:11 AM

ఇటు సెంచరీలు, అటు వికెట్లతో రాణింపు

రాయలసీమ జెన్‌ స్టార్స్‌ జట్టుకు ఎంపికై న

బొమ్మూరు యువతి లిఖిత

రాజమహేంద్రవరం రూరల్‌: నాలుగేళ్ల క్రితం సాధన మొదలుపెట్టి అనతి కాలంలోనే విమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు ఎంపికై ంది బొమ్మూరుకు చెందిన గారపాటి లిఖిత. 19 ఏళ్ల ఈమెను రాయలసీమ జెన్‌స్టార్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది. గారపాటి సర్వేశ్వరరావు, సౌజన్య దంపతుల చిన్నకుమార్తె లిఖిత. సర్వేశ్వరరావు వ్యాపారస్తుడు కాగా, సౌజన్య ప్రైవేటు ఇండస్ట్రీలో అకౌంటెంట్‌గా, ఆమె అక్క ఆశ్రిత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సర్వేశ్వరరావు కూడా క్రికెట్‌ ప్లేయర్‌. ఆయన ఆంధ్రా యూనివర్శిటీ స్థాయి వరకు క్రికెట్‌ ఆడి ఆ తరువాత వదిలేశారు. లిఖితకు ముందుగా రాజమహేంద్రవరంలో అఖిమ్‌ బాషా వద్ద క్రికెట్‌ శిక్షణ ఇప్పించారు. మూడేళ్లుగా సెంచూరియన్స్‌ క్రికెట్‌ అకాడమిలో కోచ్‌ సుమంత్‌ వద్ద శిక్షణ ఇప్పిస్తున్నారు. లిఖిత టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌తో పాటు, రైట్‌హ్యాండ్‌ ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌గా ప్రతిభ కనబరుస్తోంది.

బ్యాట్‌ పడితే సెంచరీయే..

గారపాటి లిఖిత విమెన్స్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌–2026 పోటీలలో విజయనగరం గ్రౌండ్‌లో తూర్పు గోదావరి జిల్లా తరఫునన శ్రీకాకుళం జిల్లాతో జరిగిన మ్యాచ్‌లో 112 నాటౌట్‌గా నిలిచింది. జేఎన్‌టీయూ తరఫున మైసూరులో టీ20 మ్యాచ్‌లో 124 నాటౌట్‌ నిలిచింది. 2025–26లో అండర్‌ 23 స్టేట్‌ తరఫున ఆడి వన్డే మ్యాచ్‌లలో వ్యక్తిగత స్కోరులో 169 నాటౌట్‌గా నిలిచి, ఆఫ్‌ స్పిన్నర్‌గా 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి అబ్బురపరిచింది. ఆమె అత్యుత్తమ ప్రదర్శన 7 సెంచరీలు, 20కి పైగా ఆఫ్‌ సెంచరీలు, 120కి పైగా వికెట్లు సాధించింది. వచ్చేనెల 18వ నుంచి మంగళగిరిలో జరిగే జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలలో ఆమె పాల్గొననుంది.

భారత్‌ మహిళా జట్టులో చోటు సాధించాలి

నాలుగేళ్ల నుంచి క్రికెట్‌ సాధన మొదలు పెట్టాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విమెన్స్‌ ఆంధ్రా ప్రీమియర్‌లీగ్‌, అండర్‌–23 రాష్ట్ర జట్టు లోను, ఇతర పోటీలలో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తున్నా. భారత మహిళా క్రికెట్‌ జట్టులో చోటు సాధించడమే నా ధ్యేయం. వివ్‌ రిచర్డ్స్‌, అలెక్స్‌ ఫెర్రీ తన రోల్‌ మోడల్స్‌.

– లిఖిత గారపాటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement