అమలాపురం రూరల్: జిల్లా స్థాయిలో నిర్వహించిన అమరావతి చాంపియన్ షిప్ పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న 320 క్రీడాకారులు ఆదివారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధ్వర్యంలో తిరుపతికి వెళ్లారు. డీఎస్‌ఓ వైవీ రుద్ర అధ్వర్యంలో కోచ్‌లు, మేనేజర్లతో కలసి వారు బస్సుల్లో తరలి వెళ్లారు. వారు వెళ్తున్న బస్సును ఎస్‌జీఎఫ్ సెక్రటరీ ఒ.ఈశ్వరరావు, బాస్కెట్ బాల్ కోచ్ ఎ.సూర్యకుమారి, తైక్వాండో కోచ్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు కె.గణేష్, రామారావు పాల్గొన్నారు.


