రేపటిపై ఎన్నో ఆశలు. వాటిని అందుకోవడానికి వారు పడే కఠోర శ్రమ. తీరా అందే రోజు వచ్చే సరికి పాలకుల అవినీతికి బలై.. ఆశలు ఆవిరై కొందరు ఆత్మహత్యలకు పాల్పడి.. మరికొందరు తమ విధిని తిట్టుకుంటూ మరో ప్రయత్నానికి సమాయత్తమవడం. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అవకతవకలకు ఇలా ఎందరో బలైపోయారు. వారికి అండగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారు. ఆయన పిలుపుతో జిల్లాలో పార్టీ నాయకులు, శ్రేణులు కదం తొక్కారు. అవినీతికి కారణమైన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాజమహేంద్రవరం తాడితోట సెంటర్‌లో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
నీలి ఆనంద్ ఆధ్వర్యంలో సాగుతున్న ధర్నాలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు
రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆధ్వర్యంలో
డీఎస్సీ అక్రమాలపై కదం తొక్కుతున్న పార్టీ శ్రేణులు
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త మార్గాని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని పార్టీ యువజన, విద్యార్థి విభాగాల శ్రేణులు నినదించాయి. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టే, ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లోకేశ్ కూడా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలోని మూడు లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి చెల్లించాలని, గడిచిన రెండేళ్లలో బకాయిపడిన రూ.2,160 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని కోరారు. సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,. అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ హామీలు సంపూర్ణంగా అమలు చేయడంతో పాటు ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. అంతకు ముందు పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపు మేరకు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంటమణి రమేష్ బాబు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు మానుకొండ చంద్రబాబు, యువజన విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి దాట్ల పృథ్వీరాజ్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి తగరం సోంబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలి ఆనంద్, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, జిల్లా యూత్ కార్యదర్శి విన్ను, ముచ్చకర్ల రవి ఆధ్యర్యంలో యువజనులు షెల్టాన్ హోటల్ నుంచి తాడితోట జంక్షన్ వైపు నినాదాలు చేస్తూ సాగారు. లోకేశ్ కాదు.. లీకేశ్ అంటూ హోరెత్తించారు. రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యువత, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన భారీ నిరసన, ర్యాలీ విజయవంతమైంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, నిరుద్యోగులు నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు బిల్డర్ చిన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరే చిన్ని, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, సంకిస భవానీ ప్రియ, నగర మహిళా అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, దాసి వెంకట్రావు, రొక్కం త్రినాథ్, నల్లా రామాంజనేయులు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, బూడిద శరత్‌కుమార్, ముప్పన శ్రీను, మార్తి నాగేశ్వరరావు, మార్గాని రాము, నందం స్వామి, అందనాపల్లి సత్యనారాయణ, దుర్వాసుల సత్యనారాయణ, సుందర్ సింగ్, గుడాల ఆదిలక్ష్మి, గుడాల ప్రసాద్, గుత్తుల భాస్కర్, సేపేని మునీశ్వరరావు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ బాధితులకు
అండగా నిలుస్తాం
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పేదలకు ఉచిత సీట్ల విధానాన్ని చంద్రబాబు సర్కార్ అమలు చేయడం లేదు. దీంతో పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందక అన్యాయానికి గురవుతున్నారు. కష్టపడి చదువుకుని ఉన్నత కొలువులు సాధించాలనుకున్న నిరుద్యోగుల కలలను సైతం కూటమి ప్రభుత్వం బేరానికి పెట్టేసింది. డీఎస్సీలో అర్హత ఉన్నా ఉద్యోగాలు పొందలేని వారి పోరాటానికి
వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుంది.
– మహమ్మద్ ఆరిఫ్,
వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి
పోలీసుల అడ్డగింపుతో తీవ్ర ఉద్రిక్తత
నినదించిన
వైఎస్సార్ సీపీ నాయకులు, శ్రేణులు
డీఎస్సీ అక్రమాలపై
సీబీఐ విచారణ జరిపించాలి
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లా
లోకేశ్ కూడా బాధ్యత తీసుకోవాలి
రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన
బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
నిరుద్యోగులకు ‘భృతి’ వెంటనే ఇవ్వాలి
మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ డిమాండ్
ర్యాలీలో పాల్గొన్న రంపచోడవరం
మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి
లోకేశ్ తప్పుకునే వరకూ పోరాటం
చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయి. ఈ విషయాన్ని ఆధారాలతో సహా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయటపెట్టారు. స్పోర్ట్స్ కోటా పేరుతో నచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చేశారు. మంత్రి లోకేశ్ నిర్వాకం వల్ల అర్హులకు తీవ్ర అన్యాయం జరిగింది. అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలి. డీఎస్సీ అవకతవకలకు మంత్రి లోకేశ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. లోకేశ్ రాజీనామా చేసే వరకు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంతో పాటు నిరుద్యోగ భృతి చెల్లించే వరకు పోరాటం సాగిస్తాం.
– నీలి ఆనంద్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు


