● అబ్బురపరిచిన మురుమీనాలు | - | Sakshi
Sakshi News home page

● అబ్బురపరిచిన మురుమీనాలు

Jul 29 2026 12:16 AM | Updated on Jul 29 2026 12:16 AM

పల్లిపాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌ కేంద్రంగా చేసుకుని మంగళవారం సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారులకు రంగు రంగుల మురుమీన్‌ చేపలు వలకు చిక్కాయి. సముద్రంలో రాళ్ల మధ్య ఎక్కువగా నివసించే ఈ కోవకు చెందిన చేపలు వలకు అరుదుగా చిక్కుతాయని వారు అన్నారు. శరీరంపై విభిన్న రంగుల మచ్చలు, చారలతో ఆకర్షణీయంగా కనిపించే ఈ చేపలను ఇంగ్లీషులో గ్రూపర్‌ జాతికి చెందినవిగా చెబుతారు. కాగా మురుమీన్‌ రకం చేపలు ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు, పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయని మత్స్యకారులు చెప్పారు. కిలో రూ.350 చొప్పున చేప బరువును బట్టి రేటు ఉంటుందన్నారు. హార్బర్‌ సందర్శానికి వచ్చిన వారిని ఆకర్షణీయ రంగులతో ఈ చేపలు ఎంతగానో అలరించాయి.

సఖినేటిపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement