లేఖరులు ఉపాధి కోల్పోతారు | - | Sakshi
Sakshi News home page

లేఖరులు ఉపాధి కోల్పోతారు

Jul 29 2026 12:16 AM | Updated on Jul 29 2026 12:16 AM

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న దస్తావేజు లేఖరులను ఉపాధి కోల్పోయే పరిస్థితికి చంద్రబాబు ప్రభుత్వం నెట్టడం అత్యంత దుర్మార్గమని ఆ సంఘం అధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద జిల్లా, రాజమండ్రి దస్తావేజులేఖర్ల సంఘం ఆధ్వర్యంలో లేఖరులు, వారి సహాయకులు చేస్తున్న పెన్‌డౌన్‌ తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీర్రేడ్డి, రాజమండ్రి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోలా రామచంద్రరావు, బేరి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ జీవో 396ను తక్షణమే రద్దు చేసి ఉపాధికి భరోసా కల్పించాలన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సేవలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందన్నారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, కోటి, ఫణి, శివ,ప్రకాష్‌, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు నల్లమిల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement