తూర్పుగోదావరి | - | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరి

Jul 1 2026 12:28 AM | Updated on Jul 1 2026 12:28 AM

బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026

7

ప్రభుత్వాసుపత్రిలో భౌభౌ

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ప్రస్తుతం వీధి కుక్కల ఆశ్రయ కేంద్రంగా మారినట్టు కనిపిస్తోంది. పలు వార్డుల్లో, ఆసుపత్రి ప్రాంగణంలో కుక్కలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. వాటిని చూసి రోగులు, వారి సహాయకులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. జిల్లాకే పెద్దాసుపత్రి కావడంతో ఇక్కడకు ప్రతి రోజూ సుమారు 1,200 మంది అవుట్‌ పేషెంట్లు వస్తూంటారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు అధిక సంఖ్యలో వచ్చే ఆసుపత్రిలో ఒకవేళ కుక్కలు దాడి చేస్తే పరిస్థితేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో వీధి కుక్కలు సంచరించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, రోగులకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.

– కంబాలచెరువు (రాజమహేంద్రవరం)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement