ఉత్తమ కథగా అడవి మల్లి | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ కథగా అడవి మల్లి

Jul 1 2026 12:16 AM | Updated on Jul 1 2026 12:16 AM

అనపర్తి: జీబీఆర్‌ కళాశాల గణిత ఐఐటీ ఫ్యాకల్టీ కొత్తపల్లి రవికుమార్‌ రచించిన అడవి మల్లి కథకు శ్రీమతి చల్లా సరోజనీదేవి స్మారక సంస్థ పురస్కారం లభించింది. ఈ మేరకు జూన్‌ 28న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో రవికుమార్‌ పురస్కారం అందుకున్నారు. చల్లా భాను కిరణ్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, రచయితలు ఆకెళ్ల రాఘవేంద్ర, గోపి చిరంజీవి, పాటల రచయిత వెనిగళ్ల రాంబాబు, హాస్య నటుడు శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కాగా.. రవి కుమార్‌ను జీబీఆర్‌ సంస్థల కరస్పాండెంట్‌ తేతలి ఆదిరెడ్డి (కొండబాబు), జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పీఎల్‌ఆర్‌ స్వామి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ నల్లమిల్లి అబ్బాయిరెడ్డి అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement