నేవీ లెఫ్టినెంట్‌గా తాళ్లపూడి యువకుడు | - | Sakshi
Sakshi News home page

నేవీ లెఫ్టినెంట్‌గా తాళ్లపూడి యువకుడు

Jul 1 2026 12:16 AM | Updated on Jul 1 2026 12:16 AM

తాళ్లపూడి: దేశ రక్షణలో కీలకమైన ఇండియన్‌ నేవల్‌ సర్వీస్‌ (భారత నౌకాదళం)లో తాళ్లపూడి యువకుడు గుడా విహాస్‌ సత్తా చాటాడు. తన ప్రతిభతో లెఫ్టినెంట్‌ స్థాయికి ఎదిగి, అంతర్జాతీయ శిక్షణలోనూ ఆల్‌ రౌండ్‌ ఆఫీసర్‌ అవార్డు దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాళ్లపూడిలోని సాయి స్ఫూర్తి ఆస్పత్రి సీఈవో గుడా విజయరాజు, మాజీ సర్పంచ్‌ హరిత రాణిల ఏకై క కుమారుడు విహాస్‌. కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. క్రమశిక్షణ, పట్టుదలతో అడుగులు వేస్తూ ఇండియన్‌ నేవీలో ప్రవేశించాడు. ఇటీవల మహారాష్ట్రలోని లుమావాలాలో గల ఐఎన్‌ఎస్‌ శివాజీ ట్రైనింగ్‌ కాలేజీలో ఎంటెక్‌ పూర్తి చేశాడు. 101వ బ్యాచ్‌కు చెందిన ఈల్‌ రౌండ్‌ ఆఫీసర్‌ శిక్షణలో ఐదు దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ శిక్షణలో అత్యంత ప్రతిభను కనబరిచిన విహాస్‌ ఐదు విభాగాల్లో ద్వితీయ స్థానంతో పాటు, ప్రతిష్టాత్మకమైన ఆల్‌ రౌండ్‌ ఆఫీసర్‌ అవార్డును అందుకుని భారత్‌ తరఫున సత్తా చాటాడు. మైరెన్‌ ఇంజినీర్‌గా, లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందడమే కాకుండా, తనకున్న ప్రత్యేక నైపుణ్యంతో ఈ అరుదైన అవార్డును కై వసం చేసుకున్నారు. పూణేలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న విహాస్‌ తల్లిదండ్రులు విజయరాజు, హరిత రాణిలు తమ ఆనందాన్ని పంచుకున్నారు. దేశం గర్వించే ఇండియన్‌ నేవీలో యుద్ధ నౌకకు లెఫ్టినెంట్‌గా తమ కుమారుడు బాధ్యతలు చేపట్టడం గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement