● చూడరేమిట్రీ! | - | Sakshi
Sakshi News home page

● చూడరేమిట్రీ!

Jun 30 2026 12:13 AM | Updated on Jun 30 2026 12:13 AM

రెండు నెలలుగా ఎండ తీవ్రతకు రోడ్ల పక్కన చెట్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితి రామచంద్రపురం నియోజకవర్గంలోని కె.గంగవరం మండలం పామర్రు – కె.గంగవరం, కుడుపూరు – పేకేరు, శివల – యర్రపోతవరం, దంగేరు – కుడుపూరు, కాజులూరు మండలం కుయ్యేరు – కాజులూరు, గొల్లపాలెం – ద్రాక్షారామ తదితర రహదారుల్లో ఉంది. రామచంద్రపురం మండలం పామర్రు – రామచంద్రపురం, తాడిగొయ్య – వెంకటయ్యపాలెం, హసన్‌బాద – వట్రపూడి వంటి గ్రామాలకు వెళ్లే రహదారుల్లో ఎండిపోయిన చెట్లు కోకొల్లలుగా ఉన్నాయి. ఇటీవల వీచిన భారీ గాలులకు ఎండిన చెట్లు నేలకొరిగాయి. ప్రమాదాలు జరగక ముందే ఈ ఎండిన చెట్లను తొలగించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు. –కె.గంగవరం

దంగేరు – పేకేరు రహదారిలో ఎండిపోయిన చెట్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement