రాజమహేంద్రవరం చెంతనే గోదావరి ఉందని అందరికీ తెలిసిందే. ఈ చిత్రాలు చూస్తే నగరంలోకి వచ్చిందా ఉన్నట్లు కనిపిస్తుంది. అసలు విషయం ఏంటంటే.. సోమవారం ఉదయం కురిసిన వర్షానికి చేరిన ముంపునీరు ఇది. ఎటు చూసినా చుట్టేసింది.. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి దాపురించింది. వర్షానికి హైటెక్ బస్ షెల్టర్, కంబాలచెరువు రోడ్డు, కోరుకొండ రోడ్డు, వీరభద్రపురం, రామచంద్రరావుపేట, కృష్ణానగర్, రైల్వే స్టేషన్ రోడ్డులో నీరు చేరింది. వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది.
– ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్,
రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరంలోని కోరుకొండ రోడ్డులో వర్షపునీరు
ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయ ప్రాంతంలో..


