తనిఖీలు పూర్తయ్యాకే బోట్లకు అనుమతి | - | Sakshi
Sakshi News home page

తనిఖీలు పూర్తయ్యాకే బోట్లకు అనుమతి

Jun 30 2026 12:07 AM | Updated on Jun 30 2026 12:07 AM

రాజమహేంద్రవరం సిటీ: గోదావరి నదిలో పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లలో ఒక బోటుకు చిన్నపాటి మరమ్మతుల కారణంగా మొత్తం బోట్లను నిలిపివేశారని ‘సాక్షి’లో ‘పాపికొండల్లో పర్యాటంకం’ శీర్షికతో ఆదివారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై పోలవరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సూరపాటి ప్రశాంత్‌కుమార్‌ స్పందించారు. సోమవారం పోశమ్మగండి వద్ద పర్యాటక బోట్ల యాజమాన్యంతో కలసి సోమవారం ఆయన పర్యాటక బోట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పర్యాటకుల భద్రతే ప్రధానమని, దీనిని దృష్టిలో ఉంచుకుని పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఫిట్‌నెస్‌ కలిగిన వాటిపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రతి పర్యాటకుడు లైఫ్‌ జాకెట్లు ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. బోట్లలో పరిమితికి మించి ఎక్కించుకున్నా, పర్యాటకుల భద్రత విషయంలో నిర్ల్యక్షం వహించినా కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎస్‌డీపీఏ అష్రాఫ్‌ అలీ, తహసీల్దార్‌ సత్యనారాయణ, బోట్ల యజమానులు, టూరిజం శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement