తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువైన తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు ఆదివారం భక్తజనం తరలివచ్చింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో భారీగా భక్తులు వచ్చారు. సుమారు 28 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. మధ్యాహ్నం వర్షం కురవడంతో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో వంటలు చేసుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పులిహోర, లడ్డూ ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.2,37,435, పూజా టిక్కెట్లకు రూ.4,78,904, తలనీలాలకు రూ.21,080, వాహన పూజలకు రూ.18,828, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.1,02,165, విరాళాలుగా రూ.19,987 ఆదాయం వచ్చిందని ఈఓ విశ్వనాథరాజు తెలిపారు.


