ఆలమూరు: చొప్పెల్లలో ఆదివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పట్టు పోటీలు జరిగాయి. గ్రామ దేవత శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయి. ఆలమూరు మండలం చొప్పెల్లకు చెందిన సుంకర వెంకట సాయినాథ్‌కు చెందిన ఎడ్లు ప్రథమ, రావులపాలెం మండలం ఊబలంక శివారు తోకలంకకు చెందిన గెడ్డం ప్రసాద్ ఎడ్లు ద్వితీయ, సీతానగరం మండలం వంగలపూడికి చెందిన చంద్రాల శ్రీనివాస్ ఎడ్లు తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నాయి. విజేతలకు నగదు బహుమతులు, జ్ఞాపికలను నిర్వాహకులు అందజేసి, సత్కరించారు. పోటీలను తిలకించేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.


