ఫ కరుణించమ్మా.. | - | Sakshi
Sakshi News home page

ఫ కరుణించమ్మా..

Mar 18 2026 11:09 AM | Updated on Mar 18 2026 11:09 AM

బోనమెత్తి..

అమ్మకు జైకొట్టి

రాజవొమ్మంగి గ్రామదేవత నూకాలమ్మ తల్లికి మండలం నలుమూలల నుంచి ఊరేగింపుగా వచ్చిన మహిళలు మంగళవారం బోనాలు ఎత్తుకుని అమ్మకు జైకొట్టి సమర్పించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలో వందలాది భక్తులు పాల్గొన్నారు. డప్పువాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకొన్న ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించాన్నారు. కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు.

– రాజవొమ్మంగి

కొత్త అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని తుని మండలం ఎస్‌.అన్నవరం శివారు గెడ్లబీడు సమీపంలో కొలువై ఉన్న ధారాలమ్మ అమ్మవారి బోనాల జాతర మంగళవారం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తలపై బోనాలు ధరించి, తుని పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి అర్చకులు విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ధర్మకర్త దొంగల సత్తిబాబు ఆధ్వర్యాన జరిగిన ఈ జాతర సందర్భంగా వేలాది మందికి అన్న సంతర్పణ చేశారు.

– తుని రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement