నిడదవోలు: ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డీవీవీఎస్ శర్మ (50) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మధ్యాహ్న భోజన విరామంలో భోజనానికి పాలంగిలో ఇంటికి స్కూటర్‌పై బయలుదేరారు. ఉండ్రాజవరం జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఎదురుగా వస్తున్న యువకుల బైక్, శర్మ స్కూటర్ ఎదురెదురుగా ఢీకొనడంతో శర్మ కిందపడిపోయారు. దీంతో తీవ్రగాయాలు కావడంతో స్థానికులు, తోటి ఉద్యోగులు చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. శర్మకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెంటపాడు మండలం నుంచి ఉండ్రాజవరం మండల పరిషత్‌కు బదిలీపై వచ్చారు. అనతికాలంలోనే మంచి వ్యక్తిగా పేరుపొందిన శర్మ అకాల మరణం జీర్ణించుకోలేనిదని ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. ఎంపీడీవో ఎం.శ్రీనివాసరావు, మానవత ఉండ్రాజవరం మండల అధ్యక్షుడు కటారి సిద్ధార్థరాజు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పలు పంచాయతీల కార్యదర్శులు, ఉద్యోగులు ఆయనను కడసారి చూసేందుకు ఆసుపత్రికి తరలివచ్చారు. ఆయన భార్య, పిల్లల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.
బ్రెయిన్‌స్ట్రోక్‌తో సీఆర్‌ఎంటీ..
గంగవరం: మండల విద్యాశాఖ కార్యాలయంలో సీఆర్‌ఎంటీగా పనిచేస్తున్న దుమ్ముల వరప్రసాద్ (55) బ్రెయిన్‌స్ట్రోక్‌తో మృతి చెందాడు. రెండురోజుల క్రితం వరప్రసాద్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన సోమవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరప్రసాద్ స్వగ్రామం గంగవరం మండలం నెల్లిపూడి. మంగళవారం ఆయన స్వగ్రామం నెల్లిపూడిలో అంత్యక్రియలు నిర్వహించారు. వరప్రసాద్ మృతికి జిల్లా విద్యాశాఖాధికారి వై.మల్లేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి–2 టి.మల్లేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.కృష్ణ, మండల అధ్యక్షులు బొజ్జిదొర తదితరులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు.
గుర్తు తెలియని వృద్ధుడు..
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో అస్వస్థతతో ఉన్న గుర్తుతెలియని వృద్ధుడు స్థానిక ప్రభుత్వాసుపత్రి లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని రాజమహేంద్రవరం రైల్వే జీఆర్పీ హెచ్‌సీ నాగేశ్వరరావు విలేకరులకు తెలిపా రు. సోమవారం అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలిపారు. మృతుడికి సు మారు 70 ఏళ్లు ఉంటాయని, 5.2 అడుగుల ఎత్తు ఉన్నాడని మరే విధమైన ఆధారాలు లభ్యం కాలేదన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 91545 78496 నంబర్‌కు సంప్రదించాలన్నారు.


