ఎన్‌హెచ్‌ కార్యాలయ భవనం అటాచ్‌మెంట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ కార్యాలయ భవనం అటాచ్‌మెంట్‌

Mar 18 2026 11:09 AM | Updated on Mar 18 2026 11:09 AM

రాజానగరం: దివాన్‌చెరువులోని జాతీయ రహదారుల (ఎన్‌హెచ్‌ ఏఐ) కార్యాలయ భవనాన్ని ఎంజీ మెడికల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టుకు అటాచ్‌మెంట్‌ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కోర్టు అమీనా సమక్షంలో మంగళవారం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కొవ్వూరు నుంచి గుండుగొలనుకు ఉన్న మార్గంలో ఈ సంస్థకు ఉన్న మూడు ఎకరాల భూమిని అధికారులు తీసుకున్నారు. అయితే ఆ భూమికి సంబంధించిన పరిహారాన్ని చెల్లించడంలో తీవ్ర జాప్యం జరగడంతో ట్రస్టు ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఎనిమిదేళ్లుగా జరుగుతున్న ఈ సమస్య పై చివరకు కోర్టు ఎన్‌హెచ్‌ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మనీ డిక్రీ అమలుకు ఆదేశాలిచ్చింది. దీంతో దివాన్‌చెరువులో ఆర్‌ఎస్‌ నం.560/3లో 2.110 ఎకరాలలో ఉన్న ఎన్‌హెచ్‌ కార్యాలయ భవనాన్ని, ప్రాంగణాన్ని అటాచ్‌మెంట్‌ (జప్తు వరకు వెళ్లకుండా సమస్య పరిష్కారానికిగాను ప్రాథమికంగా తీసుకునే చర్య) చేస్తూ, ఎటువంటి క్రయ, విక్రయాలు సాగించడానికి వీలులేదంటూ నోటీసు బోర్డులను కూడా ఏర్పాటుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement