బైక్‌లు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌లు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్‌

Mar 18 2026 11:09 AM | Updated on Mar 18 2026 11:09 AM

గోకవరం: బైక్‌ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గోకవరం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కోరుకొండ సీఐ ఎస్‌వీవీఎస్‌ మూర్తి మీడియా సమావేశంలో వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం పెద్ద రేలంగిపాడుకు చెందిన కాకూరి స్వామిరెడ్డి దురలవాట్లకు బానిసయ్యాడు. దీంతో బైక్‌ల చోరీలకు పాల్పడ్డాడు. బైక్‌లను చోరీ చేసి ఏజెన్సీ ప్రాంతానికి తీసుకువెళ్లి అమ్మకాలు సాగించాడు. వివిధ బైక్‌ చోరీ కేసులపై నమోదైన కేసు విషయంలో విచారణ నిర్వహించగా గోకవరం ఎస్సై పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఏడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని రిమాండ్‌ నిమిత్తం రాజమహేంద్రవరం కోర్టుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement