అదే రూపం.. అచ్చెరువొందేలా!
● తనువులు వేరైనా పోలిక ఒక్కటే
● చూపరులకు కనికట్టు చేసే చిత్రం!
● నేడు ప్రపంచ కవలల దినోత్సవం
పిఠాపురం: కను ముక్కు తీరు ఒకేలా.. హావభావాలు ఒకేలా.. నవ్వు మాటతీరు ఒకేలా.. ఆంగికం ఒకేలా.. ఆ ఇద్దరూ ఒకేలా.. అవును ఒకేలా కనిపించే వారు ఇద్దరుగా వచ్చి ఆ కుటుంబాన్నీ.. చుట్టుపక్కల వారినీ.. స్నేహితులనూ తికమక పెట్టే కవలలు వారు. భగవంతుని సృష్టిలో ఇదో విచిత్రం. ఇటువంటి వారికి వారి తల్లిదండ్రులు పేర్లు సైతం శబ్ద సారూప్యం ఉండేలా జయ విజయ, రామ తులసీ లక్ష్మీ తులసి, రామయ్య లక్ష్మయ్య, రమేష్ నరేష్, వనజ జలజ ఇలా పెడుతుంటారు. ఆదివారం ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.
దినోత్సవం మొదలైంది ఇలా..
కవలల దినోత్సవం ఏటా ఫిబ్రవరి 22న నిర్వహిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 125 మిలియన్ల ‘మల్టిపుల్స్’ (ఒకే కాన్పులో జన్మించిన ఒకరి కన్నా ఎక్కువ మంది) ఉన్నారు. ప్రపంచంలో మొదట సారి కవలల దినోత్సవాన్ని పోలెండ్‌లో 1976లో నిర్వహించారు. వేదాల్లో అశ్వినీ దేవతలు, రామయణంలో లవకుశలు, మహాభారతం లో నకుల సహదేవులు కవలలుగా మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పోలెండ్‌లో జన్మించిన మోజస్, ఆరోన్ విల్‌కాక్స్ అనే కవల సోదరులు మరణించిన రోజును ప్రపంచ కవలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. మోజస్, ఆరోన్ విల్‌కాక్స్‌లు పెద్ద మొత్తంలో భూమిని దానం చేశారు. వారి మరణానంతరం వారి సంస్మరణార్థం ఆ ఊరికి ట్విన్స్‌బర్గ్ అని పేరు పెట్టారు. వివాహాల అనంతరం కూడా తమ అనుబంధం విడిపోకూడదన్న ఆలోచనతో అక్క చెల్లెళ్లనే వారు వివాహం చేసుకున్నారు. విచిత్రంగా ఇద్దరూ ఒకే వ్యాధితో బాధపడుతూ ఫిబ్రవరి 22వ తేదీనే మరణించారు. ఆ రోజు నుంచే ట్విన్స్ డే నిర్వహిస్తున్నారు. మన దేశంలో మొదటిసారిగా కవలల పండుగ 2004లో హైదరాబాద్‌లో నిర్వహించారు. ట్విన్స్ ప్యారడైజ్ పేరుతో నిర్వహించిన ఈ పండుగలో వందలాది కవలలు పాల్గొన్నారు.
బయటివాళ్లు
పోల్చుకోలేరు
కరప మండలం పాతర్లగడ్డకు చెందిన ఉపాద్యాయుడు పులపకూర వెంకటరమణమూర్తికి ఝాన్సీరాణి, ఇషితాప్రియ అనే కవలలు ఉన్నారు. వీరు బయటకు వెళ్తే ఎవరి పేరేంటో ఎవరూ గుర్తు పట్టలేరు. ఇద్దరూ మొండి ఘటాలే. డ్రెస్సులు, ఆభరణాలు, టిఫిన్లు సైతం ఒకటే కావాలంటారు. కుదరదంటే ఆ ఇంట రణరంగమే. విచిత్రమేంటంటే ఆనందం కానీ, అనారోగ్యం కానీ ఇద్దరికీ ఒకేసారి వస్తాయంటారు వారి తల్లిదండ్రులు. అదే మండలం వేళంగికి చెందిన గుణ దంపతులకు గౌషిక్, గౌతమ్ అనే కవలలు ఉన్నారు. వీరికి నాలుగేళ్లు. వారి రూపం చేష్టలు ఒకేలా ఉంటాయి. వారి అల్లరి చేష్టలతో ఆ తల్లిదండ్రులు ముచ్చటపడుతుంటారు.
బండార్లంకలో ట్రిప్లెట్స్
అమలాపురం రూరల్: మండలంలోని బండార్లంకలో నిమిషం వ్యవధి జన్మించిన రాగిరెడ్డి లక్ష్మణ్, రాము, మోహినీ పుష్ప స్థానికులను నిత్యం తికమకపెడుతూనే ఉంటారు. ఇదే గ్రామంలో కోలిపాక రాజశేఖర్ రత్నకుమార్, చింతామోహన్ మానోభిశివరా మ్, వసా రోహితకుమార్ రోజా, చొల్లింగి సుశీల, హరిత, లంకాడి కార్తికేయ, జి.రాయ్‌వర్మ, తేజశ్రీసాయి తేజశ్రీ శైల, లోహిత రుచిత. పి లక్ష్మి, సాయి ఒకే పోలికలతో ఉండడం గమనార్హం. అలాగే కామనగరువు ఆదిత్య స్కూల్‌లో అలేఖ్య, అమూల్య, క్రిత్విక్, క్రితిక్, అనుదీప్ అనిరుథ్, విరాజ్ విరాట్, అల్లవరానికి చెందిన రామ్, లక్ష్మణ్, కామనగరువుకు చెందిన జాస్మిత శ్రీ, జస్విత శ్రీ, బండారులంక నక్క వారి పేట ఎంపీపీఎస్ చదువుతున్న మెండి నేహశ్రీ, మెండి నవ్యశ్రీ ఇలా ఎందరో కవలలు స్థానికులను అలరిస్తుంటారు.
శంఖవరానికి చెందిన
రొట్ట అనూష, సునీత
సింగులూరి
జయ, విజయ
కవలలు సకిరెడ్డి
రామ తులసి, లక్ష్మీ తులసి
సైన్స్ పరంగా..
సృష్టిలో ఉన్న వింతలలో కవలల జననం ఒకటి. తల్లి గర్భంలో జరిగే మార్పుల వల్ల వీరు పుడతారని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రత్యుత్పత్తి ప్రక్రియలో అండం ఏర్పడిన తరువాత శుక్రకణం రెండుగా విడిపోయి పుట్టిన కవలలను మోనోజైగోటిక్ లేదా యూనిఓవిలార్ ట్విన్స్ అంటారు. వీరిలో ఇద్దరు ఆడ లేక మగ అయ్యి ఉంటారు. వీరికి పోలికలు అన్ని ఒకేలా ఉంటాయి. రెండు శుక్రకణాలు ఏర్పడి జన్మించే కవలలను డైజైగోటిక లేదా జైనోవిలార్ ట్విన్స్ అంటారు వీరిలో ఒకరు ఆడ మరొకరు మగ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అదే రూపం.. అచ్చెరువొందేలా!
అదే రూపం.. అచ్చెరువొందేలా!
అదే రూపం.. అచ్చెరువొందేలా!
అదే రూపం.. అచ్చెరువొందేలా!
అదే రూపం.. అచ్చెరువొందేలా!
అదే రూపం.. అచ్చెరువొందేలా!
అదే రూపం.. అచ్చెరువొందేలా!


