అయినవిల్లికి పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: సంకట హర చతుర్థి సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయం శుక్రవారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు జరిపారు. స్వామిని మాడ వీధుల్లో ఊరేగించారు. కోలాటం నిర్వహించారు. స్వామివారి పంచామృతాభిషేకాల్లో ముగ్గురు, లఘున్యాస అభిషేకాల్లో 109 మంది, గరికపూజలో ఒక జంట, ఉండ్రాళ్ల పూజలో తొమ్మిది మంది, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 51 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. ఎనిమిది మందికి అక్షరభ్యాసాలు నిర్వహించారు. 2,500 మంది భక్తులు స్వామి అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారికి మొత్తం రూ.2,58,178 ఆదాయం లభించిందని ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.


