ఏపీఆర్‌జేసీలో ‘తిరుమల’కు ప్రథమ ర్యాంకులు
రాజమహేంద్రవరం రూరల్: ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రవరం తిరుమల విద్యార్థులు బాలినేని కళ్యాణ్‌రామ్ ఎంపీసీ విభాగంలో, బొడ్డుపల్లి మనోజ్ కుమార్ బైపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించాడని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. కె.ఫణిశ్రీ వసంత్ 3, ఆర్. చహ్న 6, పూన్న వరుణ్ తేజ్ 8, కె.సాకేత్ గుప్తా 9వ ర్యాంకులు సాధించారన్నారు. టాప్ 50లో 28, టాప్ 100లో 55, టాప్ 500లో 203 ర్యాంకులు సాధించి అత్యుత్తమ ఫలితాలు పొందారన్నారు. ఆ విద్యార్థులను తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు.
సీబీఎస్‌ఈ ఫలితాల్లో
ట్రిప్స్ విజయభేరి
రాజమహేంద్రవరం రూరల్: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో రాజమహేంద్రవరం ట్రిప్స్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. పరీక్షకు హాజరైన 50 మందీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చవి వజావత్ 500 మార్కులకు 490 (98 శాతం) మార్కులు సాధించి ప్రథమ స్థానంలో, హన్విత యశస్విని, లోహిత్ శ్రీనివాస్ 96.6 శాతంతో ద్వితీయస్థానంలో నిలిచారు. 90 శాతం పైగా మార్కులు 14 మంది, 80 శాతం నుంచి 90 శాతం మార్కులు 26 మంది, 70 శాతం నుంచి 80 శాతం మార్కులు ఏడుగురు, 60 శాతం నుంచి 70 శాతం మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారని స్కూలు చైర్మన్ బాలా త్రిపుర సుందరి తెలిపారు. ఆ విద్యార్థులను విద్యార్థులను డెరెక్టర్లు వంశీకృష్ణ, రూపాదేవి అభినందించారు.
ఏపీఆర్‌జేసీలో ‘తిరుమల’కు ప్రథమ ర్యాంకులు


