విద్య.. అస్తవ్యస్తీకరణ! | - | Sakshi
Sakshi News home page

విద్య.. అస్తవ్యస్తీకరణ!

May 12 2025 12:21 AM | Updated on May 12 2025 12:21 AM

విద్య

విద్య.. అస్తవ్యస్తీకరణ!

పదోన్నతుల్లో..

● ప్రమోషన్‌ సీనియారిటీ సమస్యలు పరిష్కరించిన తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి.

● బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ వేర్వేరుగా చేపట్టాలి. 610 జీవోలో జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయుల సీనియారిటీకి రక్షణ కల్పించాలి.

● మున్సిపల్‌ పాఠశాలల్లో అప్‌గ్రెడేషన్‌ ప్రక్రియ సత్వరమే చేపట్టి పదోన్నతులు ఇవ్వాలి.

సమస్యలపై యూటీఎఫ్‌ పోరుబాట

డీఈవో కార్యాలయాల

ఎదుట నేడు ధర్నా

117 జీవో రద్దు.. రీస్ట్రక్చరింగ్‌పై

స్పష్టత కోరుతూ నిరసనకు సమాయత్తం

రాయవరం: ఉపాధ్యాయ సమస్యలపై యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) పోరుబాట పట్టింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన 117 జీవోను రద్దు చేయాలని, పాఠశాలల రీ స్ట్రక్చరింగ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ దశల వారీ ఆందోళనకు యూటీఎఫ్‌ పిలుపునిచ్చింది. అలాగే బదిలీలు, పదోన్నతులకు అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు యూటీఎఫ్‌ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయులు సన్నద్ధమవుతున్నారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో స్పష్టమైన జీవోలు లేకుండా రోజుకో విధమైన ఆలోచనతో పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు ఎదురుగా ధర్నాకు సన్నద్ధమవుతున్నారు.

పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు..

● జీవో 117 రద్దు చేసి అందులోని లోపాలను సవరిస్తూ ప్రస్తుతం చేపడుతున్న రీ స్ట్రక్చరింగ్‌ విధానాలను పొందుపరుస్తూ కొత్త జీఓ విడుదల చేయాలి.

● అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయులను నియమించాలి.

● మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో ఐదు తరగతులు బోధించడానికి ఐదుగురు టీచర్లు నియమించాలి. విద్యార్థుల సంఖ్య 75 మించితే పీఎస్‌ హెచ్‌ఎం పోస్టు అదనంగా కేటాయించాలి. అలాగే విద్యార్థుల సంఖ్య 120కి మించితే 6వ ఎస్‌జీటీ, ఆపై ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్‌జీటీ వంతున కేటాయించాలి.

● ఉర్దూ, మైనర్‌ మీడియం బోధించే ఉపాధ్యాయులను తెలుగు మీడియం ఎస్‌జీటీ/ఎస్‌ఏలతో కలిపి లెక్కించి పోస్టులు కేటాయించడం సరికాదు. ఆ పోస్టులు అదనంగా ఇవ్వాలి.

● అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు కేటాయించాలి.

● స్కూల్‌ అసిస్టెంట్లు రెండు కేటాయిస్తే ఒకటి లాంగ్వేజ్‌, రెండోది నాన్‌ లాంగ్వేజ్‌, నాలుగు పోస్టులు కేటాయిస్తే రెండు లాంగ్వేజ్‌, రెండు నాన్‌ లాంగ్వేజ్‌ పోస్టులు కేటాయించాలి.

● స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను కేవలం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మాత్రమే నియమించాలి. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియంను కొనసాగించాలి.

● ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45కు మించితే రెండో సెక్షన్‌ ఏర్పాటు చేసి, తదనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలి.

● విద్యార్థుల సంఖ్య 300 దాటిన హైస్కూళ్లలో రెండో పీడీ పోస్టు కేటాయించాలి.

బదిలీలకు సంబంధించి..

● బదిలీల జీవో తక్షణం విడుదల చేసి, వేసవి సెలవుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి.

● బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్‌ 2 పాఠశాలల్లో ఇంటర్మీడియెట్‌ బోధనకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి.

● ఎస్‌జీటీల బదిలీల్లో మాన్యువల్‌ విధానంలో కౌన్సెలింగ్‌ నిర్వహించాలి.

● స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లు (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)కు బదిలీల్లో కొత్తగా మంజూరు చేసిన పోస్టులను ఖాళీలుగా చూపాలి.

ఉపాధ్యాయుల్లో గందరగోళం

ఏ జీవో ప్రకారం పాఠశాలలను రీస్ట్రక్చర్‌ చేస్తున్నారో ప్రభుత్వం స్పష్టమైన జీవో విడుదల చే యాలి. అలా కాకుండా రీస్ట్రక్చ ర్‌ చేస్తే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయలేం. ఉపాధ్యాయుల్లో నెలకొన్న గందరగోళాన్ని ప్రభుత్వం తొలగించేలా చర్యలు చేపట్టాలి. పదో న్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాల్లో అభ్యంతరాలను సరిచేసి, సీనియారిటీ జాబితాను విడుదల చేయాలి. – అహ్మద్‌ షరీఫ్‌, జిల్లా ప్రధాన

కార్యదర్శి, యూటీఎఫ్‌, తూర్పు గోదావరి జిల్లా

విద్య.. అస్తవ్యస్తీకరణ!1
1/1

విద్య.. అస్తవ్యస్తీకరణ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement