అమలాపురం టౌన్: సమాజంలో అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. ఫూలే వర్ధంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ పిల్లల పార్కు వద్ద జ్యోతిరావు ఫూలే విగ్రహానికి ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాడే విద్య ప్రతి ఒక్కరికీ అవసరమని గుర్తించి ఎన్నో విద్యాలయాలు నిర్మించిన మహనీయుడు ఫూలే అని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. అంబేడ్కర్ సేవా సమితి అధ్యక్షుడు చీకురుమెల్లి కిరణ్‌కుమార్, గొవ్వాల బుజ్జి, కందికట్ల వెంకటేశ్వరరావు, ముంగర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య సేవలపై శిక్షణ
అమలాపురం రూరల్: అమలాపురం భట్లపాలెం బీవీసీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ‘సంజీవని’ డిజిటల్ హెల్త్‌కేర్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వైద్యాధికారులు, సంజీవని మిత్రలు 141 మందికి శిక్షణను పూర్తి చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి దుర్గారావు దొర మాట్లాడుతూ ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
ఐఎంఏ రాష్ట్ర వైద్య
సదస్సు ప్రారంభం
అమలాపురం రూరల్: అమలాపురంలో కోనసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (కిమ్స్) వైద్య కళాశాల వేదికగా శనివారం ఐఎంఏ 68వ రాష్ట్ర స్థాయి వార్షిక వైద్య సదస్సు జరిగింది. క్రిటికల్ కేర్, ఏఐ, పాయింట్ ఆఫ్ కేర్, అల్ట్రా సౌండ్ వంటి అంశాలపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సదస్సులో కిమ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ కేవీవీ సత్యనారాయణ రాజు (చైతన్యరాజు)ను ఐఎంఏ రాష్ట్ర సదస్సు కమిటీ అభినందించింది. కిమ్స్ అధినేత సదస్సు చీఫ్ పాట్రన్ చైతన్యరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రముఖ వైద్యులు, ఐఎంఏ జాతీయ నాయకులు కలసి అమలాపురంలో సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు జరుగుతుందన్నారు. అత్యున్నత శాసీ్త్రయ వైద్య విజ్ఞాన కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి ప్రముఖ వైద్య నిపుణుల అనుభవాలను సభ్యులు వివరిస్తారన్నారు. అనంతరం పలువురు మాట్లాడారు.


