పుల్లేటికుర్రు హైస్కూల్లో ఆగంతకుడి వీరంగం | - | Sakshi
Sakshi News home page

పుల్లేటికుర్రు హైస్కూల్లో ఆగంతకుడి వీరంగం

Nov 26 2026 12:59 AM | Updated on Nov 26 2026 12:59 AM

● మద్యం మత్తులో హల్‌చల్‌

● తరగతి గదిలోకి వెళ్లేందుకు యత్నం

● ఉపాధ్యాయులకు బెదిరింపులు

అంబాజీపేట: మద్యం మత్తులో ఉన్న ఒక ఆగంతకుడు బుధవారం పుల్లేటికుర్రు హైస్కూల్లో వీరంగం సృష్టించాడు. తరగతి గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. పుల్లేటికుర్రు హైస్కూల్లో బుధవారం ప్రశాంతంగా తరగతులు జరుగుతున్న సమయంలో మద్యం తాగి ఉన్న ఓ ఆగంతుడుకు స్నేహితుడితో కలిసి మోటారు సైకిల్‌పై హైస్కూల్‌ మైదానంలోకి వచ్చాడు. అక్కడి నుంచి ఒక తరగతి గదిలోకి ప్రవేశించేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న ఓ ఉపాధ్యాయుడు అతడిని నిలువరించాడు. దీంతో ఆగంతుకుడు నానా దుర్భాషలాడుతూ, సాయంత్రానికి ఎవ్వరినైనా లేకుండా చేస్తాననంటూ బెదిరించాడు. ఈ తతంగాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుంటే.. ఎన్ని వీడియోలైనా తీసుకోండి.. ఎవరికై నా పంపుకోండి.. క్షణాలపై బయటకు వచ్చేస్తాను. ఆ తర్వాత వీరాంగం వేరే లెవెల్‌ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేశాడు. అనంతరం మోటారు సైకిల్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే ఐదుసార్లు..

ఆ ఆగంతకుడు ఇప్పటికి దాదాపు ఐదుసార్లు ఇలా హైస్కూల్లోకి చొరబడేవాడని, అతడిని మందలించి పంపించేవారమని ఉపాధ్యాయులే చెబుతున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. స్కూల్లో ఏ విద్యార్థికై నా అతడి వల్ల ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదన్నారు. విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి ఘటనలపై మౌనంగా ఉండటం సరికాదన్నారు. కాగా. అనంతపురం జిల్లా రాప్తాడు హైస్కూల్లో గత నెల 31న తరగతి గదిలో బాలికపై హేమంత్‌ అనే యువకుడు చేసిన దాడి సంఘటన మరువక ముందే, ఇప్పుడు పుల్లేటికుర్రులో ఈ ఘటన జరగడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement