అన్నవరం: కార్తికమాసాన్ని పురస్కరించుకుని అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానాన్ని గురువారం 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారి ఆలయం తెరిచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించడంతో పాటు వ్రతాల నిర్వహణ కూడా ప్రారంభించారు. స్వామివారి దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. అనంతరం సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. 1,800 సత్యదేవుని వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా రూ. 30 లక్షలు ఆదాయం సమకూరింది.


