పకడ్బందీ ఏర్పాట్లు చేశాం: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీ ఏర్పాట్లు చేశాం: కలెక్టర్‌

Nov 7 2026 12:12 AM | Updated on Nov 7 2026 12:12 AM

అమలాపురం రూరల్‌: జిల్లాలో పరిషత్‌ ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. ఈ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కౌంటింగ్‌ సిబ్బంది అవగాహన ఉండాలన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్‌ గోదావరి భవన్‌లో జాయింట్‌ కలెక్టర్‌ వైఖోం నైడియాదేవితో కలసి ఎన్నికల సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సజావుగా లెక్కింపు ప్రక్రియ జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వసంత మాధవి, రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement