ఓట్ల లెక్కింపు సకాలంలో పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపు సకాలంలో పూర్తి చేయాలి

Nov 6 2026 12:09 AM | Updated on Nov 6 2026 12:09 AM

కొత్తపేట: పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రి య సకాలంలో, ప్రశాంతంగా పూర్తయ్యేలా ఏ ర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి.ప్రశాంతి డివిజన్‌, మండల అధికారులకు సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ తీరుతెన్నులను గురువారం ఆమె పరిశీలించారు. స్థానిక ఆర్‌డీవో జీవీవీ సత్యనారాయణతో కలసి కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలకు సంబంధించిన ఓట్లు లెక్కించనున్న స్థానిక విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కేంద్రాన్ని, స్ట్రాంగ్‌ రూములను, కౌంటింగ్‌ హాళ్లను సందర్శించారు. తహసీల్దార్‌ వై.రాంబాబు, ఆర్‌ఐ పి.రవిశంకర్‌, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాన్ని

పరిశీలించిన కలెక్టర్‌

అమలాపురం రూరల్‌: ఈదరపల్లిలోని మండల ప్రజా పరిషత్‌ మోడల్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ గురువారం పరిశీలించారు. పోలింగ్‌ సరళి, భద్రతా ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు, డీఆర్‌డీఏ పీడీ డి.రాంబాబు, తహసీల్దార్‌ వీఎస్‌ దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, పోలింగ్‌ ప్రక్రియను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా కలెక్టర్‌ పర్యవేక్షించారు.

స్ట్రాంగ్‌ రూములకు

బ్యాలెట్‌ బాక్సులు

అమలాపురం రూరల్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులను జిల్లాలోని 4 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములకు తరలించారు. ఎస్పీ రాహుల్‌ మీనాతో కలిసి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఈ వివరాలు తెలిపారు. అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాల, కొత్తపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామచంద్రపురం ఎస్‌కేపీజీ జూనియర్‌ కళాశాలలకు సంబంధిత మండలాలకు చెందిన బ్యాలెట్‌ బాక్సులు తరలించామన్నారు. ఈ కేంద్రాల్లోనే శనివారం ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూముల వద్ద నిరంతర భద్రత, నిఘా కొనసాగుతాయని ఎస్పీ రాహుల్‌ మీనా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement