మూడు చోట్లా కూటమి విజయం | - | Sakshi
Sakshi News home page

మూడు చోట్లా కూటమి విజయం

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

● వార్డుల్లోనూ టీడీపీ,

జనసేనకు మెజారిటీ స్థానాలు

● 16 చోట్ల వైఎస్సార్‌ సీపీ

అభ్యర్థుల గెలుపు

సాక్షి, అమలాపురం: జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలో కూటమి విజయం సాధించింది. ఈ మూడుచోట్లా చైర్మన్‌ పదవులను దక్కించుకోవడంతో పాటు వార్డుల్లోనూ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు 16 వార్డుల్లో విజయం సాధించారు. కూటమి పార్టీలకు అధికారం అండదండలు, అంగబలం, ఆర్థిక బలం ఎన్నికల్లో బాగా కలిసి వచ్చింది.

● అమలాపురం మున్సిపాలిటీ చైర్మన్‌ పదవికి జనసేన తరఫున పోటీ చేసిన నల్లా శ్రీధర్‌ తన సమీప వైఎస్సార్‌ సీపీ ప్రత్యర్థి దూడల విరీతాదేవిపై 11,918 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 36 వార్డులకు గాను టీడీపీ 18 స్థానాలు (ఒకటి ఏకగ్రీవం), జనసేన 11, వైఎస్సార్‌ సీపీ ఆరు, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. వైఎస్సార్‌సీపీ తరఫున సంసాని శ్యామలాదేవి (15వ వార్డు), మట్టపర్తి నాగేంద్ర (18వ వార్డు), దొమ్మేటి రాము (20వ వార్డు), గొవ్వాల రాజేష్‌ (26వ వార్డు), బండారు సత్యనారాయణ (32వ వార్డు), చిత్రపు శ్యామల (34వ వార్డు) విజయం సాధించారు.

● రామచంద్రపురం మున్సిపాలిటీ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌ సీపీకి చెందిన చింతపల్లి నాగేశ్వరరావుపై గెలుపొందారు. మొత్తం 32 వార్డులకు గాను టీడీపీ 14, జనసేన 12, వైఎస్సార్‌ సీపీ ఐదు, బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. వైఎస్సార్‌ సీపీ తరఫున చోడే భాను భాస్కర్‌ (6వ వార్డు), మల్లిడి సాయిలక్ష్మి (21వ వార్డు), పిట్టి వెంకట నారాయణ (నాని) (24వ వార్డు), కుడుపూడి లక్ష్మీ బేబీ (30వ వార్డు), సూరంపూడి గణేష్‌ (31వ వార్డు) విజయం సాధించారు.

● ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్‌ పదవికి జనసేన తరఫున పోటీ చేసిన గుబ్బల గంగారత్నభవాని తన సమీప వైఎస్సార్‌ సీపీ ప్రత్యర్థిపై 2,299 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 23 వార్డులకు గాను టీడీపీ 15, వైఎస్సార్‌ సీపీ ఐదు, జనసేన మూడు స్థానాలను కై వసం చేసుకున్నాయి. వైఎస్సార్‌ సీపీ తరఫున యలమంచిలి రాజశేఖర్‌ (16వ వార్డు), కడలి పార్వతి (23వ వార్డు), పొనుగుమట్ల వెంకట సూర్యనారాయణ (17వ వార్డు), రామాయణం శ్రీరామచంద్రమూర్తి (19వ వార్డు), గంజా దుర్గా అరుణకుమారి (8వ వార్డు) విజయం సాధించారు.

మురసుతో కౌంటింగ్‌కు ఆటంకాలు

మూడు పట్టణాల్లో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అయితే మురసు తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో రెండు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. ముఖ్యంగా రామచంద్రపురంలో కౌంటింగ్‌ ప్రక్రియ అసాధారణంగా జాప్యమైంది.

విజయం సాధించిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement