ఉప్పలగుప్తం: అర్నబ్ తుపాను సంభవించివారం రోజులు గడుస్తున్నా తమ గ్రామాలకు విద్యుత్ సరఫరాను అందించలేదంటూ భీమనపల్లి గ్రామస్తులు మంగళవారం ధర్నాకు చేపట్టారు. ఈ సందర్భంగా సిరిపల్లి మునిపల్లి ఆర్‌అండ్ బీ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ తరణంలో వాహనాల రాకపోకల ఆగిపోయి వాహన చోదకులకు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా చుట్టుపక్కల గ్రామాలకు అరకొరగా విద్యుత్ సరఫరా అందిన తమ గ్రామాలకు పూర్తిగా లేదని వారు వాపోయారు. భీమనపల్లితో పాటు విలసవిల్లి, నంగవరం గ్రామాల్లో గత వారం రోజులుగా విద్యుత్ సరఫరాలేదని, మిగతా గ్రామాల్లో కేవలం రాత్రి 10 తర్వాత మాత్రమే విద్యుత్ సరఫరా ఉంటుందని, అధికారులు తరగతిన మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను అందించాలని ప్రజలు కోరుతున్నారు.


