ఊసరవెల్లి రాజకీయాలకు చరమగీతం | - | Sakshi
Sakshi News home page

ఊసరవెల్లి రాజకీయాలకు చరమగీతం

Nov 2 2026 12:11 AM | Updated on Nov 2 2026 12:11 AM

ఆలమూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఊసరవెల్లి రాజకీయాలకు చరమగీతం పాడేందుకు వీలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకే ఓటు వేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలో వైఎస్సార్‌ సీపీ నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ్మన శ్రీనివాస్‌తో పాటు 18 గ్రామాల్లోని 21 మంది ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున మండలంలో ఆదివారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కారు ఏర్పాటు చేయడమంటే కూటమి దృష్టిలో నిత్యావసరాల ధరలు మూడు రెట్లు పెంచడమేనా అని నిలదీశారు. ధరలు తగ్గాలంటే ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి ఓటు వేసి, చంద్రబాబు సర్కారుకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలో కొంతమంది జనసేన నేతలను టీడీపీ టిష్యూ పేపరులా వాడుకుని వదిలేస్తున్న విషయం పినపళ్లలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతుందని అన్నారు. జిల్లాలో మత విద్వేషాలను, హింసను రెచ్చగొట్టి కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని జగ్గిరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల శ్రేయస్సు అవసరం లేదన్నారు. కేవలం ధనికులైన కార్పొరేట్లకు మేలు జరిగితే సరిపోతుందనే ఆలోచనలో పాలకులు ఉన్నారనడానికి ఆకాశాన్నింటిన బియ్యం ధరలే ఉదాహరణని చెప్పారు.

తొలుత చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభించిన ప్రచారాన్ని జగ్గిరెడ్డి చొప్పెల్లలో ముగించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు ఆయా గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వారి ప్రచారానికి వాడవాడలా అపూర్వ స్వాగతం పలికారు. హిందూ ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో అభ్యర్థులు పూజలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఆశీస్సులు అందుకున్నారు.

ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ధరలు మూడు రెట్లు పెరగడమా!

ధరలు తగ్గాలంటే వైఎస్సార్‌ పీపీకే

ఓటు వేయాలి

‘పరిషత్‌’ ఎన్నికల ప్రచారంలో

వైఎస్సార్‌ సీపీ నేత జగ్గిరెడ్డి

జనసేన నేతల్లో కొందరిని టీడీపీ

టిష్యూ పేపరులా వాడుకుందని విమర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement