నేడే మున్సిపోల్‌ | - | Sakshi
Sakshi News home page

నేడే మున్సిపోల్‌

Nov 1 2026 12:09 AM | Updated on Nov 1 2026 12:09 AM

వార్డులు

36

ఓటర్లు

41,079

పోలింగ్‌ బూత్‌లు

71

ఫ జిల్లాలో రెండు మున్సిపాలిటీలు,

ఒక నగర పంచాయతీ

ఫ 91 వార్డుల్లో ఎన్నికల సమరం

ఫ ఓటు హక్కు వినియోగించుకోనున్న 98,035 మంది ఓటర్లు

సాక్షి, అమలాపురం: మున్సిపల్‌ ఎన్నికలకు తుది ఘట్టం ఆదివారం జరుగనుంది.. జిల్లాలో పురపోరుకు సర్వం సిద్ధమైంది. రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో ఎన్నికల సందడి నెలకొంది. అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీలో బుధవారం పోలింగ్‌ జరగనుంది. మూడు పురపాలికల్లో చైర్మన్‌ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహిస్తుండగా, 91 వార్డు కౌన్సిలర్‌ స్థానాలకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 98,035 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 91 పోలింగ్‌ కేంద్రాలు, 1,085 మంది ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేశారు.

జిల్లాలోని మూడు పురపాలికల్లో మొత్తం 91 వార్డులు ఉండగా, 47,658 మంది పురుషులు, 50,377 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 2,719 మంది అధికంగా ఉండటం విశేషం. మొత్తం ఓటర్లలో మహిళలు 51.39 శాతం, పురుషులు 48.61 శాతం ఉన్నారు. మూడు పురపాలికల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. వారే అభ్యర్థుల భవితవ్యాన్ని మార్చనున్నారు.

ప్రశాంత ఎన్నికలకు ఆదేశాలు

పురపాలక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష జరిపారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల పరిధి, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

వార్డులు

32

ఓటర్లు

35,728

పోలింగ్‌ బూత్‌లు

50

అమలాపురంలో అత్యధిక ఓటర్లు

ఫ మూడు పురపాలికల్లో అమలాపురం మున్సిపాలిటీలో అత్యధికంగా 41,079 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 36 వార్డులు ఉండగా, 20,064 మంది పురుషులు, 21,015 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 951 మంది అధికం.

ఫ రామచంద్రపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు సంబంధించి 35,728 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 17,188 మంది పురుషులు, 18,540 మంది మహిళలు. ఇక్కడ మహిళా ఓటర్లు 1,352 మంది ఎక్కువగా ఉన్నారు.

ఫ ముమ్మిడివరం నగర పంచాయతీలో 23 వార్డులకు 21,228 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10,406 మంది పురుషులు, 10,822 మంది మహిళలు. ఇక్కడ కూడా మహిళా ఓటర్లు 416 మంది అధికంగా ఉన్నారు.

పోలింగ్‌కు విస్తృత ఏర్పాట్లు

మూడు పురపాలికల్లో పోలింగ్‌ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. వార్డుల వారీగా పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల జాబితాలను పరిశీలించి అవసరమైన సిబ్బందిని నియమించింది. పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, దివ్యాంగుల కోసం ర్యాంపులు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులు చర్యలు చేపట్టారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు పోలింగ్‌ సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లపై దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement