● చీకట్లో.. హతవిధి | - | Sakshi
Sakshi News home page

● చీకట్లో.. హతవిధి

Nov 1 2026 12:09 AM | Updated on Nov 1 2026 12:09 AM

తుపాను తంటాలు తెస్తే.. ఎన్నికల విధులు హతవిధిలా మారాయి. ఈదురు గాలులకు చెట్లు కూలిపోయి, విద్యుత్‌ వ్యవస్థ పాడైంది. సుమారు ఐదు రోజులుగా ఎక్కడికక్కడే సరఫరా నిలిచిపోయింది. ఇలాంటి సమయంలో ఎన్నికల విధులు సిబ్బందికి కత్తి మీద సాములా మారింది. అమలాపురం మున్సిపల్‌ ఎన్నికల్‌ పోలింగ్‌ విధులకు వచ్చిన సిబ్బంది ఆయా బూత్‌లలో విద్యుత్‌ లేకుండా, ఫ్యాన్లు తిరగకుండా చీకట్లోనే శనివారం రాత్రంతా ఉండాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం పోలింగ్‌ సందర్భంగా సరంజామాతో వచ్చిన వారు ఆయా కేంద్రాల్లో నరకం చూశారు. –‘సాక్షి’, అమలాపురం

● సెల్‌ లైట్ల వెలుగుల్లో..

స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లు, భూపయ్య అగ్రహారం పోలింగ్‌ బూత్‌ల్లో పోలింగ్‌ సిబ్బంది శనివారం రాత్రి సెల్‌ ఫోన్లు లైట్లు వేసుకున్న దృశ్యాలు కనిపించాయి. పట్టణంలోని 36 పోలింగ్‌ కేంద్రాలకు కేవలం 8 కేంద్రాల్లో మాత్రమే విద్యుత్‌ సరఫరాను శనివారం మధ్యాహ్నానికి పునరుద్ధరించగలిగారు. మిగిలిన కేంద్రాల్లో సాయంత్రానికి పునరుద్దరిస్తామన్న మున్సిపల్‌ కమిషనర్‌ నిర్మల్‌కుమార్‌ మాటలు అమలు కాలేదు.

అమలాపురం టౌన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement