నడుములు విరిగేలా.. | - | Sakshi
Sakshi News home page

నడుములు విరిగేలా..

Oct 27 2026 12:09 AM | Updated on Oct 27 2026 12:09 AM

అధికారంలోకి రాగానే రోడ్ల రూపురేఖలు మారుస్తామని, గుంతలు లేని విధంగా తీర్చిదిద్దుతామని గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు గొప్పలు చెప్పారు. వారి మాటలు కోటలు దాటినా.. గద్దెనెక్కిన దాదాపు రెండున్నరేళ్లలో వారి ఆచరణ మాత్రం గడప కూడా దాటలేదు. జిల్లాలో అనేక రహదారులు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. నిలువెల్లా ఛిద్రమైన రహదారులపై వాహనదారుల నడుములు విరుగుతున్నా.. పాలకులు మాత్రం తాము ఎంతో ప్రగతి సాధించేశామంటూ కోతలు కోస్తూనే ఉన్నారు. జిల్లాలోని పలు రహదారుల దుస్థితిపై ‘సాక్షి’ ఫోకస్‌..

గోతులతో ప్రమాదకరంగా..

ఐ.పోలవరం మండలం పాత ఇంజరం నుంచి టి.కొత్తపల్లి వెళ్లే ప్రధాన రహదారి ఇది. టి.కొత్తపల్లి, అడవిపేట, సీతమ్మ చెరువు, పాత ఇంజరం, ఐ.పోలవరం గ్రామాల ప్రజలకు ఇదే ప్రధాన మార్గం. ప్రతి రోజూ సుమారు 2 వేల మంది ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తూంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రహదారి గోతులతో ప్రమాదకరంగా మారింది. అగాధాల్లాంటి గుంతలను తప్పించుకుంటూ వెళ్లే క్రమంలో వాహనాలు అదుపు తప్పి, ప్రమాదాలు జరుగుతున్నాయి.

సాక్షి, అమలాపురం/నెట్‌వర్క్‌: ఏడాదికొక్కసారి జరిగే సంక్రాంతి పండగకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారిని మాయలో ముంచెత్తడానికా అన్నట్టు.. గుంతలు లేని రహదారులు అంటూ చంద్రబాబు సర్కారు తెగ హడావుడి చేస్తూంటుంది. ఆ సమయంలో వచ్చిన వారు ఇక్కడి రోడ్లను చూసి ‘ఆహా.. ఓహో’ అనుకుని వెళ్లిపోతారు. ఆ తర్వాత అంతే సంగతులు.. కొద్ది రోజుల్లోనే ఆ రోడ్లు మళ్లీ ఛిద్రమైపోతూండటంతో జిల్లావాసులను అగచాట్లు తప్పడం లేదు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా.. ఎక్కడ చూసినా జిల్లాలో రహదారులు గుంతలు, గోతులతో అధ్వానంగా మారాయి. చినుకు పడితే చెరువులను తలపిస్తున్నాయి. అదే ఎండ కాస్తే దుమ్ము, ధూళి కమ్మేస్తున్నాయి. దీంతో, ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు, కార్లు, బస్సులు, లారీలు ప్రమాదాల అంచున ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. వర్షాలు కురిసినప్పుడు అగాధాల్లాంటి గుంతల్లో నీరు నిలిచిపోతూండటంతో ఏది గొయ్యో, ఏది రోడ్డో తెలియని దుస్థితిని వాహనచోదకులు ఎదుర్కొంటున్నారు. మారుమూల పల్లెలే కాదు.. అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలోనూ పలు రహదారులది ఇదే దుస్థితి. గ్రామాలను కలిపే కీలక రహదారులు సైతం పరమ అధ్వానంగా ఉన్నాయి. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు రోడ్లను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అనేక రహదారులు గుంతలమయంగానే దర్శనమిస్తున్నాయి. పాలకుల మాటలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక పోసి.. మాయ చేసి..

జొన్నాడ – కాకినాడ ప్రధాన రహదారిలో ఆలమూరు ‘ఎస్‌’ మలుపు వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కోనసీమ – కాకినాడ జిల్లాలను అనుసంధానించే ఈ కీలక మార్గంలో నిత్యం వందలాది లారీలు, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తూంటాయి. ఇటువంటి కీలక రహదారిపై పెద్దపెద్ద గోతులు ఏర్పడగా వాటిని కేవలం ఇసుకతో పూడ్చి వదిలేశారు. వాహనాల రాకపోకలతో ఆ ఇసుక లేచిపోవడంతో గోతులు మళ్లీ బయట పడటం వంటి పరిస్థితులు ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది.

సహనానికి పరీక్ష

జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణంలోని భూపయ్య అగ్రహారం రహదారి గజానికో గొయ్యితో ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఇది కోట్లాది రూపాయల విలువైన అపార్ట్‌మెంట్లు, కమర్షియల్‌ భవనాలు ఉన్న ప్రాంతం. ఇక్కడే రోడ్డు ఇంత దారుణంగా ఉంటే మిగిలిన ప్రాంతాల సంగతి ఇక చెప్పనవసరమే ఉండదు. గొప్పగొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేసేస్తున్నామని చెప్పుకొంటున్న స్థానిక కూటమి నేతలకు ఈ రహదారి మీద పడిన గోతులు కనిపించకపోవడం విడ్డూరం.

రోడ్ల ఆధునీకరణపై

కూటమి నేతల కోతలు

పట్టణాలు, పల్లెల్లో ఎక్కడ చూసినా

అధ్వాన రహదారులే

గ్రామాలను కలిపే కీలక

రహదారులకూ మరమ్మతులు కరువు

అడుగడుగునా గుంతలు

పొంచి ఉన్న ప్రమాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement