గ్రామీణ రహదారులకు దిక్కేదీ? | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ రహదారులకు దిక్కేదీ?

Oct 27 2026 12:09 AM | Updated on Oct 27 2026 12:09 AM

అమలాపురం వద్ద జాతీయ రహదారి–216 బైపాస్‌ నుంచి కామనగరువు, చిందాడగరువు గ్రామాలకు వెళ్లే మార్గం కూడా అధ్వానంగా మారింది. ఈ రెండు గ్రామాల నుంచి అమలాపురం పట్టణానికి వచ్చేవారు ప్రధానంగా ఈ రోడ్డునే వినియోగిస్తారు. స్థానికంగా ఆమని ఆటోమొబైల్స్‌ వద్ద సీసీ రోడ్డు దారుణంగా దెబ్బ తిని ప్రమాదకరంగా మారింది. దీనికి తోడు గుంతలు కూడా పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నగర పంచాయతీలో

పుంతదారి

మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల అవసరాల కోసం మట్టి, గ్రావెల్‌తో పుంత రోడ్లు నిర్మిస్తారు. ఇంచుమించు ఇటువంటి రహదారులే ముమ్మిడివరం నగర పంచాయతీలో ఉండటం విశేషం. అధికారంలోకి రాగానే మూడో వార్డులోని చింతలమెరక రహదారిని ఆధునికీకరిస్తామన్న కూటమి నేతల హామీలు నేటికీ నెరవేరలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement