లో
పడుతూ లేస్తూ ప్రయాణం
మలికిపురం మండలం రామరాజులంక గ్రామంలో ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ప్రాంత ప్రజలు జనసేనకు భారీ మెజారిటీ ఇచ్చారు. ప్రస్తుత ఎంపీపీ, సర్పంచ్ సైతం అదే పార్టీకి చెందిన వారే. అయినప్పటికీ ఈ రోడ్డు ఆధునికీకరణను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్కడ గోతులున్నాయో తెలియక వాహనదారులు పడుతూ లేస్తూ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ గ్రామమంతటా పవన్ కల్యాణ్ ఊరేగారని, కానీ రహదారి మాత్రం బాగుపడలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
నిలువెల్లా ఛిద్రమై..
అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం నుంచి అమలాపురం మండలం పాలగుమ్మి గ్రామానికి వెళ్లే రహదారి ఇలా నిలువెల్లా ఛిద్రమైపోయింది. రెండు మండలాలను కలిపే ఈ మార్గంలో అడుగడుగునా గుంతలే. ఏమాత్రం వర్షం కురిసినా నీరు నిలిచిపోయి రహదారి మొత్తం చిత్తడిగా మారుతోంది. ఈ రహదారిని ఆధునికీకరించాలని స్థానికులు కోరుతున్నా.. రెండున్నరేళ్లుగా వారి ఆశలు నెరవేరడం లేదు.
8


