ఫ్యాన్‌.. ప్రచార జోరు | - | Sakshi
Sakshi News home page

ఫ్యాన్‌.. ప్రచార జోరు

Oct 27 2026 12:09 AM | Updated on Oct 27 2026 12:09 AM

అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, చేసిన అభివృద్ధిని ఇంటింటా ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగం, నిర్బంధ కాండ, ప్రజలపై దాడులు తదితర ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్నారు., అలాగే, నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ పెరిగిపోతున్నా ఏమాత్రం పట్టించుకోని సర్కారు తీరును ఎండగడుతున్నారు. అభ్యర్థులతో పాటు వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement