వైఎస్సార్ సీపీలో చేరిన వారికి
పార్టీ కండువాలు వేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
నరేంద్రపురంలో జనసేన నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన
కార్యకర్తలకు పార్టీ కండువాలు వేస్తున్న గన్నవరపు శ్రీనివాసరావు
ఆలమూరు: ఫ్యాన్ గాలికి గ్లాస్ బద్దలవుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆదివారం గోపాలపురంలోని జగ్గిరెడ్డి నివాసంలో పార్టీలో చేరిన వారికి ఆహ్వాన కార్యక్రమం జరిగింది. జనసేన మండల శాఖ ఉపాధ్యక్షుడు కొనగళ్ల ధనరాజు నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలు చామకూరు శివరాం, కోట రాజు, గుత్తుల నాగేశ్వరరావు, బేతా వీర్రాజు, పిల్లి రాజు ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలకు చెందిన పార్టీ శ్రేణులు వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరికి జగ్గిరెడ్డి కండువాలు వేసి ఆహ్వానించారు. హామీల అమలులో విఫలమైన చంద్రబాబు సర్కార్‌ను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడించి, వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని వారికి జగ్గిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీ మండల కన్వీనర్, జెడ్పీటీసీ అభ్యర్థి తమ్మన శ్రీనివాసు, నెక్కంటి వెంకట్రాయుడు, చామకూరి శ్రీనివాసు, పాలింగి ఉమాదేవి, ఉండమట్ల శ్రీనివాసు, పిల్లి ధనరాజు, ఎంపీటీసీ అభ్యర్థి పిల్లి సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
జనసేనలో కార్యకర్తలకు విలువ లేదు
జనసేన పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు, విలువ లేదని ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిన ధనరాజు నాయుడు అన్నారు. జనసేన ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన వారికి అసలు విలువే లేదన్నారు, వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాలకే తప్ప కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిండం లేదన్నారు. పినపళ్లలో జనసేన పార్టీలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందని, ప్రస్తుతం చేరిన 50 కుటుంబాలే కాక త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి నాయకత్వంపై ఉన్న విశ్వాసంతో పార్టీలో చేరినట్లు జనసేన నేతలు తెలిపారు. ఈ చేరికలతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
వైఎస్సార్ సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షుడు ధనరాజు
50 కుటుంబాలతో కలసి చేరిక
ఆహ్వానించిన
జిల్లా పార్టీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి


