ఓటుతో కూటమికి బుద్ధి చెప్పండి | - | Sakshi
Sakshi News home page

ఓటుతో కూటమికి బుద్ధి చెప్పండి

Oct 26 2026 12:16 AM | Updated on Oct 26 2026 12:16 AM

● జెడ్పీటీసీ అభ్యర్థి చింతా అనురాధ

● మాజీ ఎంపీ బోస్‌తో కలిసి

ఎన్నికల ప్రచారం

కె.గంగవరం: ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి సర్కారుకు ఓటుతో బుద్ధి చెప్పాలని మండల జెడ్పీటీసీ అభ్యర్థి, మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు. మండలంలోని బ్రహ్మపూరి, మసకపల్లి, భట్లపాలిక, పేకేరు, తాళ్లపోడు గ్రామాల్లో ఆదివారం మాజీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని, ఇప్పుడు జరుగుతున్న నయవంచనను బేరీజు వేసుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పప్పు నుంచి ఉప్పు వరకూ అన్ని సరకుల ధరలూ పెరగడంతో సామాన్యులు బతకడం చాలా కష్టతరంగా మారిందన్నారు. కనీసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కూడా పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా కొత్త పింఛన్లు ఇస్తామంటూ దరఖాస్తులు తీసుకున్నారే తప్ప, మంజూరు చేయడం లేదని దుయ్యబట్టారు. బోస్‌ మాట్లాడుతూ తమ అమూల్యమైన ఓటును జెడ్పీటీసీ అభ్యర్థి చింతా అనురాధకు, మసకపల్లి ఎంపీటీసీ అభ్యర్థి కాదా గోవిందుకు, భట్లపాలిక ఎంపీటీసీ అభ్యర్థి కాళా వెంకటరమణకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాస్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పండు గోవిందరాజు, మాజీ సర్పంచ్‌లు పిల్లి కళ్యాణ్‌, సాగి వీరభద్రరాజు, ఎంపీటీసీ మాజీ సభ్యులు కొప్పిశెట్టి లక్ష్మణ్‌, బీసీ నాయకులు బొంతు నాగేశ్వరరావు, లంకే శ్రీను, పితాని వెంకటరమణ, చిట్టూరి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement