అన్నవరంలో కార్తికం ఏర్పాట్లపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

అన్నవరంలో కార్తికం ఏర్పాట్లపై సమీక్ష

Oct 26 2026 12:22 AM | Updated on Oct 26 2026 12:22 AM

అన్నవరం: వచ్చే నెల పదో తేదీ నుంచి ప్రారంభం కానున్న కార్తిక మాసంలో సత్యదేవుని ఆలయానికి లక్షలాదిగా భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున దేవస్థానంలో చేస్తున్న ఏర్పాట్లపై దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు ఆదివారం సమీక్షించారు. ప్రధానంగా భక్తుల వాహనాల పార్కింగ్‌ విషయమై దేవస్థానంలో అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలించారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో జరిగిన సమావేశంలో భక్తులు రత్నగిరికి రాకపోకలు సాగించేందుకు వీలుగా దేవస్థానం ట్రాన్స్‌పోర్టు సిబ్బందికి పలు ఆదేశాలిచ్చారు. కాగా.. సత్యదేవుని ఆలయానికి ఆదివారం భక్తులు పొట్తెతారు. సుమారు 40 వేల మంది భక్తులు రావడంతో క్యూలైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం సమకూరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement