ఐ.పోలవరం: మండలంలోని ఎర్రగరువు గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి, ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని పొలంలో గేదెలు, ఆవులు మేపడానికి ఉదయమే వెళ్లిన నూనె వెంకటేశ్వరరావు (70) పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి గంజా ఏడుకొండలు పిడుగుపడిన శబ్ధానికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆయనను చికిత్స కోసం యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రామచంద్రపురం రూరల్: మండలంలోని జగన్నాయకులపాలేనికి చెందిన అడ్డాల రమేష్ భవనం పైనుంచి పడిన సంఘటనలో గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ద్రాక్షారామ హెడ్ కానిస్టేబుల్ పి.మల్లికార్జునరావు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 5వ తేదీ రాత్రి సమయంలో తన ఇంటి డాబాపైకి వెళ్లిన రమేష్ ప్రమాదవశాత్తూ చీకటిలో కాలుజారి కిందకు పడిపోయాడు. దీంతో బలమైన గాయాలు కావడంతో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం జీజీహెచ్‌కు తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. భార్య రత్నమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఫొటోగ్రాఫర్ మృతి
దేవరపల్లి: కొవ్వూరు మండలం ధర్మవరానికి చెందిన ఫొటోగ్రాఫర్ పిల్లి బన్ని (22) దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద 16వ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఫొటోగ్రఫీ పని మీద త్యాజంపూడి వెళ్లి తిరిగి స్కూటీపై ఇంటికి తిరిగి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఎస్సై పి.మనోహర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వెంకన్న ఆలయానికి
భవనం బహూకరణ
అనపర్తి: బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఆ గ్రామానికి చెందిన మండ సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం భార్య సుజాత, కుమారులు రామారెడ్డి, నాగిరెడ్డి సుమారు రూ.20 లక్షల విలువైన సీసీ బిల్డింగ్‌ను ఆలయ ట్రస్టుకు బహూకరించారు. ఆలయంలో స్వామివారికి నిత్య కై ంకర్యాలు నిర్వహించే అర్చకులు నివసించేందుకు ఈ భవనాన్ని వినియోగించాలని వారు కోరారు. ఈ సందర్భంగా గురువారం అర్చకుల సమక్షంలో భవనానికి సంబంధించిన పత్రాలను ఆలయ కమిటీ సభ్యుల కు అందజేశారు. భక్తి, సేవాభావంతో ఆల యానికి విలువైన భవనాన్ని బహూకరించిన మండ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల ఔదార్యాన్ని పలువురు అభినందించారు.


