రైల్‌జన్‌ సంవాద్‌తో సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రైల్‌జన్‌ సంవాద్‌తో సమస్యల పరిష్కారం

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

సామర్లకోట: విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో జరుగుతున్న రైల్‌ జన్‌ సంవాద్‌ కార్యక్రమంతో ప్రయాణికులకు మేలు జరుగుతుందని ఆ డివిజన్‌ సీనియర్‌ డీఈఎన్‌ సి.గౌతమ్‌ కుమార్‌ అన్నారు. ఈ మేరకు గురువారం సామర్లకోటలో ఏర్పాటు చేసిన రైల్‌ జన్‌ సంవాద్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికుల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికి వీలు కలుగుతుందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి రైల్వే సిద్ధంగా ఉందన్నారు. సామర్లకోట రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఎక్స్‌లేటర్‌, వెయింట్‌ హాళ్లు మార్చి నాటికి పూర్తయితే, మరింత సుందరంగా రైల్వే స్టేషన్‌ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ ఎం.రమేష్‌ అధ్యక్షత వహించగా, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ కల్యాణి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ కేవీ గిరి, సీసీఐ మధు, ఏఏఈ రత్నచందు, ఆర్పీఎఫ్‌ సీఐ కె.మధు, వివిధ డిపార్టుమెంట్ల అధికారులు, వ్యాపారస్తులు, ప్రయాణికులు పాల్గొన్నారు. అలాగే రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనులను, పరిసర ప్రాంతాలను గౌతమ్‌ కుమార్‌ పరిశీలించారు.

26న పారా మెడికల్‌

కోర్సులకు కౌన్సెలింగ్‌

కాకినాడ క్రైం: అలైడ్‌ హెల్త్‌ కేర్‌ డిప్లొమా కోర్సుల్లో పారా మెడికల్‌ ప్రవేశానికి 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 26న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రయాగ ఉషాకిరణ్‌ గురువారం ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 8.30 గంటలకు కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలకు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాల కోసం ఆర్‌ఎంసీకాకినాడ.కంవెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

రేపు సివిల్‌ సర్వీస్‌ క్రీడా ఎంపికలు

ప్రకాశం నగర్‌(రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయి సివిల్‌ సర్వీస్‌ క్రీడా ఎంపికలు నిర్వహించనున్నారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డీఎంఎం శేషగిరి గురువారం సాయంత్రం ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, క్యారమ్స్‌, చదరంగం, క్రికెట్‌, ఫుట్‌ బాల్‌, హాకీ, కబడ్డీ, లాన్‌ టెన్నిస్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, యోగా, వెయిట్‌ లిఫ్టింగ్‌, వాలీబాల్‌, రెజ్లింగ్‌, బెస్ట్‌ ఫిజిక్‌, పవర్‌ లిఫ్టింగ్‌ వంటి క్రీడా అంశాల్లో ఎంపికలు జరుగుతాయన్నారు. నాన్‌ యూని ఫాం ప్రభుత్వ ఉద్యోగులైన పురుషులు, మహి ళలు (ఓపెన్‌) ఈ పోటీలకు అర్హులని, ఆసక్తి కలవారు ఽశనివారం ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 87126 22569 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement