జెడ్పీ పీఠం ఎస్సీ మహిళకు.. | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ పీఠం ఎస్సీ మహిళకు..

Oct 20 2026 1:50 AM | Updated on Oct 20 2026 1:50 AM

కొత్తగా కోనసీమ జిల్లా పరిషత్‌ ఏర్పడిన తరువాత తొలిసారి జరుగుతున్న జెడ్పీ ఎన్నికలకు సంబంధించి చైర్‌పర్సన్‌ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించారు. దీంతో ప్రధాన పార్టీల నేతలు చైర్‌పర్సన్‌ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ పదవి ఆశిస్తున్న వారు తమకు అనుకూలమైన జెడ్పీటీసీ స్థానాలను ఎంపిక చేసుకుని పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో 19 జెడ్పీటీసీలకు గాను కేవలం ఐ.పోలవరం, మామిడికుదురు మాత్రమే ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయ్యాయి. దీంతో, ఆశావహులు ఎస్సీ జనరల్‌, జనరల్‌ మహిళ, జనరల్‌కు రిజర్వ్‌ అయిన స్థానాల్లో కూడా తమ అదృష్టాన్ని పరిశీలించుకునే అవకాశమున్నా రిజర్వ్‌ స్థానాల పైనే గురి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement