టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి.. | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి..

Oct 20 2026 1:50 AM | Updated on Oct 20 2026 1:50 AM

మలికిపురం: పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకూ తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పాముల రాజేశ్వరీదేవి అన్నారు. దిండి గ్రామంలో మాజీ ఉప సర్పంచ్‌ కలిగితి రామారావు (టీడీపీ) సహా ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు సోమవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి రాజేశ్వరీదేవి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యులు కేఎస్‌ఎన్‌ రాజు, పాముల దేవీప్రకాష్‌, గెడ్డం రవీంద్ర, గ్రామ శాఖ నాయకులు ఏలూరి గణపతి, గొల్ల సుధాకర్‌రెడ్డి, మెడి ది చంద్రశేఖర్‌, గెడ్డం సుబ్రహ్మణ్యం, దేవ శ్యాంబాబు, గుడాల ప్రసాద్‌, ఇంజెటి సుధాకర్‌ పాల్గొన్నారు.

గుడిమూలలో..

సఖినేటిపల్లి: గుడిమూల గ్రామంలో యాదవ సామాజికవర్గానికి చెందిన సుమారు 20 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరాయి. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చిన్నరాజా ఆధ్వర్యాన గ్రామ శాఖ అధ్యక్షుడు కోన ప్రభాకర్‌ పర్యవేక్షణలో వారు పార్టీలో చేరారు. టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న వారికి పాముల రాజేశ్వరీదేవి పార్టీ కండువాలు వేసి, స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారిలో బీనబోయిన కనకదుర్గ, బీనబోయిన నాగేశ్వరరావు తదితరులున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్‌, రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్‌, నాయకులు పి.నీలిమ, చింటూ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement