అక్రమంగా ఆక్వా చెరువుల తవ్వకం | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా ఆక్వా చెరువుల తవ్వకం

Oct 20 2026 1:50 AM | Updated on Oct 20 2026 1:50 AM

తాళ్లరేవు: ప్రభుత్వ భూములను ఆక్రమించి కొందరు అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వుతున్నారని సీపీఎం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కూటమి నాయకుల అండదండలతో చెరువుల తవ్వకం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కోరంగి నేషనల్‌ హైవే వంతెన వద్ద నుంచి పాత కోరంగి రోప్‌వే బ్రిడ్జి వరకూ ఆత్రేయ గోదావరి చెంతన విలువైన సుమారు పదెకరాలకు పైగా అసైన్డ్‌ భూమిని సమీపంలోని చెరువుల రైతులు దర్జాగా ఆక్రమించి సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి ఈ భూమినంతటినీ సర్వే చేయించాలని, తక్షణమే ఆక్రమణలు తొలగించి ఆ భూములను పేదలకు పంచాలని సీపీఎం మండల కార్యదర్శి టేకుమూడి ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ ఫిర్యాదుపై తహసీల్దార్‌ జి.రామ వీరభద్రరావు స్పందించారు. రెవెన్యూ అధికారులతో ఆ భూముల్లో సర్వే చేయించగా, అక్రమంగా తవ్విన చెరువుల్లో కొంత ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిర్ధారించారు. అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement