రాజోలు: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన శివకోటి ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. అండర్ – 17 విభాగంలో మట్టపర్తి బాలవంశీ, గొల్లమందల దుర్గా వినయ్, దొంగ మణికుమార్, అండర్ – 14 విభాగంలో అప్పారి ఓం సాయిచరణ్ ఈ ఘటన సాధించారు. వీరిని ప్రధానోపాధ్యాయుడు నైనాల శ్రీనివాస్ అభినందించారు. పీఎంసీ చైర్ పర్సన్ తోలేటి లోఇ్మ, వైస్ చైర్మన్ కోన విజయరత్నం, వ్యాయామ ఉపాధ్యాయుడు చొప్పల చంద్రశేఖర్ అభినందించారు.


