నేడు యఽథావిధిగా పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు యఽథావిధిగా పీజీఆర్‌ఎస్‌

Sep 28 2026 12:41 AM | Updated on Sep 28 2026 12:41 AM

అమలాపురం రూరల్‌: జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలను ఈ నెల 28వ తేదీ సోమవారం యథావిధిగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్‌ గోదావరి భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రజలు తమ అర్జీలను అందజేయవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌లోనూ అర్జీలు నమోదు చేయవచ్చని తెలిపారు. తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లోనూ పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

సమన్వయంతో

నులిపురుగుల నివారణ

అమలాపురం రూరల్‌: జిల్లాలోని అధికారులు, సిబ్బంది సమన్వయంతో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎం అండ్‌ హెచ్‌వో దుర్గారావు దొర ఆదివారం కోరారు. గతంలో వాయిదా పడిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని సోమవారం నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. జిల్లాలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలలు, ఐటీఐలు, నర్సింగ్‌ కళాశాలలు, ప్రైవేట్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఒకటో సంవత్సరం విద్యార్థులకు మాత్రలు వేయించాలన్నారు. గైర్హాజరైన పిల్లలు, విద్యార్థులకు అక్టోబర్‌ ఐదో తేదీన మాత్రలు అందజేయనున్నట్టు తెలిపారు.

వైద్య ఉద్యోగాలను తగ్గించే

జీవోలు రద్దు చేయాలి

ఏపీజీఈఏ జిల్లా సమావేశం డిమాండ్‌

అమలాపురం టౌన్‌: వైద్యశాఖలో ఉద్యోగాలను క్రమేపీ తగ్గించేందుకు విడుదల చేసిన 143, 32 జీవోలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమావేశం డిమాండ్‌ చేసింది. స్థానిక గొల్లగూడెం బైపాస్‌ రోడ్డులో గల ఏపీజీఈఏ జిల్లా శాఖ కార్యాలయంలో ఆదివారం జిల్లా ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కె.మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఆ జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వచ్చే నవంబర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరగనున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల ప్రాంతీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పి.గిరిప్రసాద్‌వర్మ, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు యాళ్ల మోహనరావు సమావేశానికి ముఖ్య అతిధులుగా హాజరై ప్రసంగించారు. సంఘ నేతలు ఎం.శ్రీనివాస్‌, యు.కుమారి, పి.కామేశ్వరరావు, జి.సద్గుణరావు, జి.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వీఆర్‌ఏల సమస్యలను

వెంటనే పరిష్కరించాలి

ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌

ఉప్పలగుప్తం: గతంలో వీఆర్‌ఏలకు హామీలు ఇచ్చి ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చిరుద్యోగులైన వీఆర్‌ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద వీఆర్‌ఏల సంఘ మండల అధ్యక్షుడు ఉందుర్తి అంజలరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న వీఆర్‌ఏల 12వ రోజు నిరసన శిబిరం వద్దకు వెళ్లి తమ మద్దతు తెలిపారు. పే స్కేల్‌, రెగ్యురలైజేషన్‌, పదోన్నతి వంటి విషయాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వంగా గిరిజాకుమారి, జిల్లా కార్యదర్శి పొగాకు శ్రీను, నేతలు సీహెచ్‌ విద్యాసాగర్‌, ఎల్‌.శ్రీను, పి.రమణ, జె.సురేష్‌, ఎస్‌.పట్టాభి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement