● ఆ దిశగా కార్యకర్తలు పని చేయాలి
● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపు
ఉప్పలగుప్తం: వైఎస్సార్ సీపీ కార్యకర్తలు శక్తిమంతంగా పని చేసి, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. ఉప్పలగుప్తంలోని పార్టీ బూత్ కమిటీల విభాగం జిల్లా అధ్యక్షుడు చీకట్ల కిషోర్ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్, వైఎస్సార్ సీపీ అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు డాక్టర్ పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావుతో కలసి ఎమ్మెల్సీ త్రిమూర్తులు పాల్గొన్నారు. మండలానికి తొలిసారి వచ్చిన సునీల్‌ను ఆయన అభిమానులు చీకట్ల కిషోర్ ఆధ్వర్యాన గజమాలతో సత్కరించి, వేద పండితుల సమక్షంలో పూర్ణకుంభంతో స్వాగతించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, తమ పరిశ్రమలు అనేకచోట్ల ఉన్నాయని, ఈ జిల్లాలో సైతం అనువైన ప్రాంతాల్లో అనుకూలమైన పరిశ్రమలు ఏర్పాటు చేసి, యువతకు చేయూతనిస్తామని అన్నారు. డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, తమ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), పార్టీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్య, రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి వాసు, జిల్లా ఉపాధ్యక్షుడు కూనపురెడ్డి రాంబాబు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగా గిరిజా కుమారి, పార్టీ మండల అధ్యక్షుడు బద్రి బాబ్జీ, జిల్లా కార్యదర్శి పొగాకు శ్రీను, యువజన విభాగం మండల అధ్యక్షుడు ఓగూరి విజయకుమార్, బూత్ కమిటీ, ఆర్‌టీఐ విభాగం అధ్యక్షులు కోటుం లోవరాజు, పోలిశెట్టి వీర్రాజు, నాయకులు కుంచే స్వామి, నల్లా నాయుడు, తదితరులు పాల్గొన్నారు.


