డిగ్రీ ప్రవేశాలకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ ప్రవేశాలకు వేళాయె..

Aug 7 2026 12:14 AM | Updated on Aug 7 2026 12:14 AM

ఈ నెల 11 వరకు

దరఖాస్తుల స్వీకరణ

26న సీట్ల కేటాయింపు

27 నుంచి తరగతులు

రాయవరం: ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఎట్టకేలకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్‌ విడుదల చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గతేడాది మాదిరిగానే ఆన్‌లైన్‌ విధానంలో అడ్మిషన్లు జరగనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో సైన్స్‌, ఆర్ట్స్‌, కామర్స్‌, ఒకేషనల్‌ కోర్సుల్లో సుమారు 35 వేల వరకు సీట్ల భర్తీకి అవకాశముంది.

షెడ్యూల్‌ ఇలా..

ఈ నెల 11వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 5 నుంచి 20వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. 12 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపడతారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు కోర్సులను ఎంపికకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. వెబ్‌ ఆప్షన్ల మార్పునకు 20న తేదీ అవకాశం కల్పించారు. 26న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీలోగా ఎంపికై న కళాశాలలో విద్యార్థులు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ప్రతి జిల్లాలో ఒక నోడల్‌ కళాశాలలను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల, కాకినాడ జిల్లాలో పీఆర్‌ డిగ్రీ కళాశాల, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కొత్తపేట వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నోడల్‌ కళాశాలలుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement