‘సర్‌’కు ఈ మూడు రోజులే కీలకం | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’కు ఈ మూడు రోజులే కీలకం

Jul 12 2026 12:17 AM | Updated on Jul 12 2026 12:17 AM

ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు

అమలాపురం టౌన్‌: ఎస్‌ఐఆర్‌ ఓట్ల సమగ్ర జాబితా కార్యక్రమానికి తుది గడువు ఈ నెల 14వ తేదీ కావడంతో ఈ మూడు రోజులు బీఎల్వోలు, బీఎల్‌ఏలకు ఎంతో కీలకమని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. అమలాపురం మున్సిపల్‌ కార్యాలయలో కమిషనర్‌ వి.నిర్మల్‌కుమార్‌ అధ్యక్షతన శనివారం జరిగిన పట్టణంలోని 44 పోలింగ్‌ బూత్‌ల బీఎల్వోలు, బీఎల్‌ఏల సమావేశానికి ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మరో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ పట్టణంలో 81 శాతం మేర ఓటర్ల ఎన్యూమరేషన్‌, డిజిటలైజేషన్‌ పూర్తి అయ్యిందన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ, పట్టణ వైఎస్సార్‌ పీపీ అధ్యక్షుడు సంసాని బులినాని, జనసేన నాయకుడు కల్వకొలను తాతాజీ, బీజేపీ నాయకుడు యల్లమిల్లి నాగ సుధాకొండ మాట్లాడుతూ ఓటర్ల ఎన్యూమరేషన్‌పై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కమిషనర్‌ నిర్మల్‌కుమార్‌ మాట్లాడుతూ పట్టణంలో 41,120 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో దాదాపు 31 వేల మంది వరకూ ఓటర్లకు ఎన్యూమరేషన్‌ పూర్తయ్యిందన్నారు. దాదాపు వెయ్యి చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లు ఉన్నాయన్నారు. ఇంకా దాదాపు 5 వేల ఓట్లకు ఎన్యూమరేషన్‌, డిజిటలైజేషన్‌ జరగాల్సి ఉందని వివరించారు. అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు రెడ్డి సత్య నాగేంద్రమణి, చిక్కాల గణేష్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, పార్టీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ మున్సిపల్‌ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొవ్వాల రాజేష్‌, పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, కట్టోజు సన్నయ్యదాసు, బండారు గోవిందు పాల్గొన్నారు.

సాగునీటి పంపిణీలో ప్రభుత్వం విఫలం

అమలాపురం రూరల్‌: సాగునీటి పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యుడు, రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా కో–కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిందాడగరువులో సాగునీరు అందక నారుమడులు ఎండిపోతున్నాయని రైతుల ఆందోళన నేపథ్యంలో ఆ గ్రామంలో పరిస్థితిని వ్యవసాయ కార్మిక సంఘం బృందం ఽశనివారం పరిశీలించింది. ఆయన మాట్లాడుతూ క్లోజర్‌ పనుల ఆలస్యం కారణంగా నేటికీ శివారు గ్రామాలకు సాగునీరు చేరడం లేదన్నారు. ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇబ్బంది ఎదురవుతుందని అన్నారు. కాలువల మరమ్మతులు, పూడికతీత పనులను సకాలంలో చేపట్టే ప్రయత్నం చేయకపోవడం వల్లే నేడు నారుమడులు ఎండిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. చిందాడగరువు, వన్నెచింతలపూడి శివారు గ్రామాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా నాయకులు పచ్చిమాల శివ, రైతులు పి.చిన్నపేరయ్య, పొనకల సూరిబాబు, శ్రీను, మట్టా రాజు, విజయకుమార్‌ పాల్గొన్నారు.

లోక్‌అదాలత్‌లో

211 కేసుల పరిష్కారం

అమలాపురం టౌన్‌: Ý린MýS MøÆý‡$tÌZÏ AÐ]l$-Ìê-ç³#Æý‡… Æð‡…yø A§ýl-¯]lç³# MøÆý‡$t hÌêÏ ¯éÅĶæ$-Ð]lÊ-Ç¢, Ð]l$…yýlÌS ÎVýSÌŒæ çÜÈÓ-òÜ‹Ü MýSÑ$sîæ O^ðlÆŠ‡-ç³-Æý‡Þ¯ŒS VýS$º¾ÌS ^èl…{§ýl-Ð]l˜-äÔèæÓÇ B«§ýlÓ-Æý‡Å…ÌZ Ôèæ°-ÐéÆý‡… ÌZMŠS A§é-ÌS™Œæ fÇW…-¨. C…§ýl$ÌZ {糫§é-¯]l…V> Vø yìlhsŒæ f¯]l-Æý‡ÌŒæ C¯ŒS-{çÜ*-ె¯ŒSÞ MýS…ò³-±MìS çÜ…º…-«¨…-_¯]l K Ððl*sêÆý‡$ Ķæ*MìSÞ-yðl…sŒæ MýSÏÆ‡$$ÐŒl$ í³sîæ-çÙ-¯ŒSÌZ Æý‡*.1.15 MørÏ ¯]lçÙt ç³Ç-àÆý‡… »ê«¨™èl MýS$r$…º çÜ¿¶æ$Å-ÌSMýS$ C^éaÆý‡$. ©°MìS çÜ…º…-«¨…-_¯]l ^ðlMýS$P¯]l$ »ê«¨™èl MýS$r$…-»ê-°MìS Æð‡…yø A§ýl-¯]lç³# MøÆý‡$t hÌêÏ ¯éÅĶæ$-Ð]lÊ-Ç¢ ^èl…{§ýlÐ]l˜-äÔèæÓ-Ç, 14Ð]l A§ýl-¯]lç³# MøÆý‡$t hÌêÏ ¯éÅĶæ$Ð]lÊÇ¢ VýS…sê {í³Ä¶æ$-§ýlÇØ° A…¨…^éÆý‡$. ÌZMŠS A§é-ÌS-™ŒæÌZ Ððl¬™èl¢… Æý‡*.5,54,83,000 ÑË$-OÐðl¯]l 211 MóSçÜ$Ë$ ç³Ç-ÚëP-Æý‡-Ð]l$Ķæ*ÅÆ‡$$. Ayìl-çÙ-¯]lÌŒæ 看Üt M>Ï‹Ü MøÆý‡$t Ððl$h-[-õÜtsŒæ í³.¿ê-¯]l$-ÝëÆ‡$$, »êÆŠ‡ AÝùíÜ-Äôæ$-çÙ¯ŒS A«§ýlÅ„ýS$yýl$ M>Õ ÔóæÚëÆ>Ð]l#, ÌZMŠS A§é-ÌS™Œæ çÜ¿¶æ$ÅË$ MðS.Ððl…-MýS-r-Æ>Ð]l#, gñæ.MýS-¯]l-MýS-§ýl$Æý‡Y, yìl.¿ê-çÜPÆý‡ gZVóS‹Ù ™èl¨-™èlÆý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement