రావణ్‌పై ‘ఉపా’ చట్టాన్ని ఉపసంహరించండి | - | Sakshi
Sakshi News home page

రావణ్‌పై ‘ఉపా’ చట్టాన్ని ఉపసంహరించండి

Jul 12 2026 12:17 AM | Updated on Jul 12 2026 12:17 AM

ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్‌

అమలాపురం టౌన్‌: యూ ట్యూబర్‌ ప్రశ్న రావణ్‌పై మోపిన ఉపా చట్టాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌లో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ధర్నా జరిపారు. రావణ్‌పై దేశ ద్రోహంతో పాటు అత్యంత కఠినమైన ఉపా చట్టాన్ని ప్రయోగించడంపై ప్రజా సంఘాల ప్రతినిధులు తప్పుపట్టారు. సమాజంలోని లోపాలు, పాలకుల వైఫల్యాలను నిలదీసి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించే వారిపై ఇలా ఉగ్రవాద నిరోధక చట్టాలైన ఉపా వంటి సెక్షన్లు మోపడం దుర్మార్గమైన చర్య అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్‌ అన్నారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రజా సమస్యలపై స్పందించే వారిపై సాగుతున్న పోలీసుల వేధింపులను అరికట్టాలని నినాదాలు చేశారు. రావణ్‌ అరెస్ట్‌పై కూటమి ప్రభుత్వంలోని నేతలు వ్యంగ్యంగా మాట్లాడడంపై వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నాయకుడు కారెం వెంకటేశ్వరరావు అభ్యంతరం చెప్పారు. ప్రజా సంఘాల ప్రతినిధులు కొండా దుర్గారావు, జి.దుర్గాప్రసాద్‌, జిల్లెళ్ల మనోహర్‌, ఎ.రవి, అమలదాసు బాబూరావు, పచ్చిమాల శివ, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement