ఫ బీఎల్వోల యాప్ సమాచారం టీడీపీకి..
ఫ కమిషనర్‌కు వైఎస్సార్ సీపీ
పట్టణ అధ్యక్షుడి ఫిర్యాదు
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణంలోని బీఎల్వోల ఆన్‌లైన్ యాప్‌లో నమోదైన ఓటర్ల సమాచారం టీడీపీ బీఎల్వోల యాప్‌లోకి వెళుతోందని పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సంసాని బులినాని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటరుకు చెందిన పూర్తి డేటా చౌర్యం జరుగుతోందని ఆరోపించారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్‌కు బులినాని శనివారం లిఖిత పూర్వకంగా ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాలను ఎంతో పారదర్శకంగా సంస్కరిస్తుంటే.. కొందరు కూటమి పార్టీల నాయకులు అధికార దర్పంతో ఓటరు పూర్తి సమాచారాన్ని టీడీపీ బీఎల్వో యాప్‌ల ద్వారా తెలుసుకుంటున్నారని వివరించారు. ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని గుర్తు చేశారు. ఇలాంటి అక్రమాలతో ఎస్‌ఐఆర్ లక్ష్యానికి తూట్లు పొడిచినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తప్పిదాన్ని తమ పార్టీ గమనించి ఎస్‌ఐఆర్ ప్రారంభ సమయంలోనే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని బులినాని అన్నారు. పట్టణంలోని 45వ పోలింగ్ స్టేషన్‌లో ఓ ఓటరుకు చెందిన డేటా చౌర్యం జరిగిన తీరును బులినాని కమిషనర్‌కు ఆధారాలతో సహా తెలిపారు. దీనిపై తక్షణమే విచారణ నిర్వహించి, ఓటరు డేటా చౌర్యం కాకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ మున్సిపల్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొవ్వాల రాజేష్, పార్టీ జిల్లా కార్యదర్శి విత్తనాల మూర్తి, మాజీ కౌన్సిలర్ కట్టోజు సన్నయ్యదాసు తదితరులు పాల్గొన్నారు.


